Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee61c4c60-2999-485c-a7e4-0c9dcaeb7d92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee61c4c60-2999-485c-a7e4-0c9dcaeb7d92-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రత్యేకమైన సినిమాలలో ఖడ్గం సినిమా ఒకటి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సమయాలలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో ఈ సినిమా కచ్చితంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వల్ల చాలామంది కృష్ణవంశీ డైరెక్షన్ కు ఫ్యాన్స్ గా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.ఇదిలావుండగా దేశభక్తి ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం ఖడ్గం. ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శ కత్వం వహించారు. కార్తికేయ మూవీస్ ఆధ్వర్యంలో సుంకర మధు మురళి ని ర్మించారు. 20socialstars lifestyle{#}karthikeya;kartikeya;krishna vamshi;murali;Sangeetha;Sunkara Ramabrahmam;Murari;Khadgam;Gemini;Mohandas Karamchand Gandhi;Traffic police;Chitram;Heroine;Prakash Raj;Darsakudu;November;Pooja Hegde;Cinema;October;krishna;Directorఖడ్గం రీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా..?ఖడ్గం రీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా..?socialstars lifestyle{#}karthikeya;kartikeya;krishna vamshi;murali;Sangeetha;Sunkara Ramabrahmam;Murari;Khadgam;Gemini;Mohandas Karamchand Gandhi;Traffic police;Chitram;Heroine;Prakash Raj;Darsakudu;November;Pooja Hegde;Cinema;October;krishna;DirectorThu, 19 Sep 2024 19:08:16 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రత్యేకమైన సినిమాలలో ఖడ్గం సినిమా ఒకటి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సమయాలలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో ఈ సినిమా కచ్చితంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వల్ల చాలామంది కృష్ణవంశీ  డైరెక్షన్ కు ఫ్యాన్స్ గా మారారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.ఇదిలావుండగా దేశభక్తి ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం ఖడ్గం. ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శ కత్వం వహించారు. కార్తికేయ మూవీస్ ఆధ్వర్యంలో సుంకర మధు మురళి ని ర్మించారు. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా రవితేజ.. ముస్లిం యువకుడిగా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇక ఇందులో హీరోయిన్ సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన అమాయకమైన పాత్రలో నటించి మెప్పించిం ది సంగీత. ఈ మూవీలో సంగీత క్యారెక్టర్స్, డ్రెస్సింగ్ అప్పట్లో చాలా ట్రెండ్ అయ్యాయి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ, సంగీత మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇందులో సంగీతతోపాటు సోనాలి బింద్రే, కిమ్ శర్మ, పూజా భారతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను గాంధీ జయంతి రోజు రీ రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపాడు.ఇదిలావుండగా ఖడ్గం సినిమా రీ రిలీజ్ విషయంలో కృష్ణవంశీ తమ అభిమానులకు క్షమాపణ చెప్పారు. పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు.ఖడ్గం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ సారీ. అక్టోబర్ రెండు నా మూవీ విడుదల కావాల్సి ఉండగా కలర్ కలెక్షన్, రిస్టోరేషన్ పూర్తి కాకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని మాట ఇస్తున్నాను. అని పోస్ట్ చేశారు.ఖడ్గం రీరిలీజ్ లో కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో అదరగొడుతుందో చూడాల్సి ఉంది. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మురారి మూవీ రీరిలీజ్ లో హిట్ గా నిలవడం గమనార్హం. ఖడ్గం సినిమా ఎన్ని థియేటర్లలో రీరిలీజ్ అవుతుందో చూడాలి. దేవర సినిమా రిలీజ్ తర్వాత ఖడ్గం రీరిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.ఖడ్గం సినిమాకు రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తే మరిన్ని హిట్ సినిమాల రీరిలీజ్ దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>