PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcp-tdp-kutami-ap-politics86ac3347-865b-4a1a-adae-a66b986b234f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcp-tdp-kutami-ap-politics86ac3347-865b-4a1a-adae-a66b986b234f-415x250-IndiaHerald.jpg వైయస్ ఫ్యామిలీ అంటేనే ఆంధ్ర ప్రజలకు ఎంతో ఆదరాభిమానం ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి తరతరాల రాజకీయం అనేది ఉంది. ఆ ఫ్యామిలీ గడ్డు రోజులను, మంచి రోజులను ఎదుర్కొంది. ఏ కష్టం వచ్చినా ప్రజల వైపు నిలబడిందని చెప్పవచ్చు. అలాంటి వైయస్ ఫ్యామిలీ నుంచి మొదటిసారి రాజశేఖర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. ఆయన ఉన్నన్ని రోజులు ఎన్నో అభివృద్ధి పనులు, పేద ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి వల్ల మేలు పొందిన వారు జీవితాల్లో చాలా స్థిరపడ్డారు. ఇప్పటికి ఆయన ఫోటోను ఇండ్లలో దేవుడితో సJAGAN; YSRCP; TDP KUTAMI; AP POLITICS{#}gold;dr rajasekhar;Congress;Father;Leader;Janasena;Election;TDP;YCP;Andhra Pradesh;Party;Jagan;Reddy;CMపడి లేచే కెరటం జగన్..2029 జగన్ దే హవా?పడి లేచే కెరటం జగన్..2029 జగన్ దే హవా?JAGAN; YSRCP; TDP KUTAMI; AP POLITICS{#}gold;dr rajasekhar;Congress;Father;Leader;Janasena;Election;TDP;YCP;Andhra Pradesh;Party;Jagan;Reddy;CMThu, 19 Sep 2024 09:35:00 GMT- ఒంటి చేత్తో అధికారంలోకి రావడం జగన్ కు కొత్తేమీ కాదు.
-రాజకీయాల్లో రాటుదేలిన వైయస్ ఫ్యామిలీ.
- ప్రశ్నించే గొంతుకైతే 2029 తనదే.?


 వైయస్ ఫ్యామిలీ అంటేనే   ఆంధ్ర ప్రజలకు ఎంతో ఆదరాభిమానం ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి తరతరాల  రాజకీయం అనేది ఉంది. ఆ ఫ్యామిలీ గడ్డు రోజులను, మంచి రోజులను ఎదుర్కొంది.  ఏ కష్టం వచ్చినా ప్రజల వైపు నిలబడిందని చెప్పవచ్చు.  అలాంటి వైయస్ ఫ్యామిలీ నుంచి మొదటిసారి రాజశేఖర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు.  ఆయన ఉన్నన్ని రోజులు ఎన్నో అభివృద్ధి పనులు, పేద ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి వల్ల మేలు పొందిన వారు జీవితాల్లో చాలా స్థిరపడ్డారు.  ఇప్పటికి ఆయన ఫోటోను ఇండ్లలో దేవుడితో సమానంగా కొలుస్తారు. ఆ విధంగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి కూడా  రాజకీయాల్లో రాటుదేలిపోయారు. విపత్కర పరిస్థితులను కూడా ఎలా  ఎదుర్కోవాలో తెలుసుకున్నారు. ఎప్పుడైనా సరే ఓటమి అనేది గుణపాఠం నేర్పిస్తుంది. జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన  కొంతకాలంలోనే సీఎం అయ్యారు. ఇది పాలన దక్షత నేర్పించింది. ఇక ఓటమి ఇంకా ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఈ విధంగా విపత్కర, ఆనంద పరిస్థితులను అనుభవించిన జగన్ 2029 టార్గెట్ గా ముందుకు వెళ్తారు. 2029 వరకు ఆయన చేయాల్సిన పనులేంటి వివరాలు ఏంటో చూద్దాం.

 2029 టార్గెట్ :
 2019లో జగన్మోహన్ రెడ్డి  150 సీట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో ఉత్తమమైన పథకాలు తీసుకొచ్చారు.  విద్యా వ్యవస్థ బాగుపడితే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని విద్యకి ఎక్కువగా నిధులు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను, ప్రైవేటుకు ధీటుగా తయారు చేశాడు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటికే పథకాలు అందేలా చేశారు. ఇలా ఎన్ని చేసినా  జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన కింద ఉన్నటువంటి అనుచర ఘణం అని చెప్పవచ్చు. ఒక లీడర్ అంటే కేవలం పరిపాలనపై దృష్టి పెట్టకుండా, కింది స్థాయిలో లీడర్లు  ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు, వారు ఏ పనులు చేస్తున్నారు అనేది కూడా తప్పక తెలుసుకోవాలి. అలాంటప్పుడే  రాజకీయాల్లో అన్ని విధాల రాణించగలం.

 కానీ జగన్ మొదటిసారి గెలిచాడు కాబట్టి అవి గ్రహించలేకపోయాడు. ఈ ఓటమి ఆయనకు ఎంతో గుణపాటాన్ని నేర్పుతుంది. ఎవరిని హక్కున చేర్చుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది అర్థమయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఆయన 2029 టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు తప్పక జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే బలం సంపాదించుకోవడం కోసం ట్రై చేస్తోంది. ఒకవేళ ఈ ఐదేళ్లలో వారి మధ్య పొత్తు విషయంలో చిచ్చు పుట్టిందంటే  పవన్ ఒంటరిగా పోటీ చేస్తాడు. అదే జరిగితే మాత్రం తప్పక జగన్మోహన్ రెడ్డికి బంగారు బాటలు పడ్డట్టే.  2029వరకు టీడీపీ కాకుండా జనసేన మరియు వైసిపి మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ ఐదేళ్లు పాలిస్తే తప్పక వ్యతిరేకత వస్తుంది. ఈ రెండు పాయింట్లు ఉపయోగించుకొని  జగన్ నిత్యం ప్రజల్లో ప్రజలతో మమేకమై ఉంటే 2029 లో తప్పక అధికారంలోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>