PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-pk-work-for-jagan-why-should-he2ccf1510-a344-4947-a6ef-28259cd8b1fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-pk-work-for-jagan-why-should-he2ccf1510-a344-4947-a6ef-28259cd8b1fa-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో వైసీపీ ఒకటి కాగా వైసీపీ విషయంలో జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నకు మాత్రం అవుననే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. బాలినేని లాంటి కీలక నేతలు సైతం పార్టీని వీడుతున్నారంటే ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి కొందరు కీలక నేతలు సైతం పార్టీకి భారీ షాకిచ్చే దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. jagan{#}Bharatiya Janata Party;Jagan;Janasena;YCP;Partyవైసీపీ విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న జగన్.. ఫ్యాన్స్ సైతం నమ్మట్లేదా?వైసీపీ విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న జగన్.. ఫ్యాన్స్ సైతం నమ్మట్లేదా?jagan{#}Bharatiya Janata Party;Jagan;Janasena;YCP;PartyThu, 19 Sep 2024 06:15:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో వైసీపీ ఒకటి కాగా వైసీపీ విషయంలో జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నకు మాత్రం అవుననే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. బాలినేని లాంటి కీలక నేతలు సైతం పార్టీని వీడుతున్నారంటే ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి కొందరు కీలక నేతలు సైతం పార్టీకి భారీ షాకిచ్చే దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది.
 
ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీలో జగన్, ఒకరిద్దరు కీలక నేతలు మినహా ఎవరూ ఉండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ వీరాభిమానులు సైతం రాష్ట్రంలో పార్టీ పుంజుకుంటుందని నమ్మట్లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుందని చెప్పవచ్చు.
 
వైసీపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి జగన్ గతంలో చేసిన తప్పులు కొంతమేర కారణమైతే ఇప్పుడు చేస్తున్న తప్పులు కొంతమేర కారణమని చెప్పవచ్చు. రాష్ట్రంలో వైసీపీని వీడిన నేతలు టీడీపీలో చేరే అవకాశం లేకపోతే జనసేన వైపు బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండటంతో ఏ పార్టీలో చేరినా నష్టం అయితే లేదని వైసీపీని వీడిన నేతలు భావిస్తుండటం గమనార్హం.
 
వైసీపీకి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ షాకులు అయితే తప్పవని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీకి దూరమయ్యే నేతలు ఎవరో చూడాల్సి ఉంది. జగన్ ఇప్పటికైనా పార్టీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. మరి జగన్ ప్లాన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. జగన్ ఎన్నికల తర్వాత చేస్తున్న పనులు సైతం విమర్శల పాలవుతూ ఉండటం ప్రస్తుతం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్ అవుతోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>