Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6aab9fbe-e54b-464b-bff9-5a5be92c84b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6aab9fbe-e54b-464b-bff9-5a5be92c84b7-415x250-IndiaHerald.jpgహీరోయిన్ పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె.. తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. వివిధ విషయాల్లో స్పందిస్తూ ఉంటోంది. సామాజిక అంశాలపై తనదైన శైలిలో పోస్టులు పెడుతుంటోంది. అప్పుడప్పుడు సంచలన పోస్ట్స్ చేస్తుంటోంది. సినిమాలు చేయకపోయినా.. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.అయితే టాలీవుడ్‌ లో ప్ర‌స్తుతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిsocialstars lifestyle{#}tammareddy bharadwaja;Kavuru Srinivas;maa association;poonam kaur nakshatra;Industries;johnny;Johnny;Hyderabad;Director;Cinemaత్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు..స్పందించిన నిర్మాత తమ్మిరెడ్డి..!!త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు..స్పందించిన నిర్మాత తమ్మిరెడ్డి..!!socialstars lifestyle{#}tammareddy bharadwaja;Kavuru Srinivas;maa association;poonam kaur nakshatra;Industries;johnny;Johnny;Hyderabad;Director;CinemaWed, 18 Sep 2024 12:15:00 GMTహీరోయిన్ పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె.. తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. వివిధ విషయాల్లో స్పందిస్తూ ఉంటోంది. సామాజిక అంశాలపై తనదైన శైలిలో పోస్టులు పెడుతుంటోంది. అప్పుడప్పుడు సంచలన పోస్ట్స్ చేస్తుంటోంది. సినిమాలు చేయకపోయినా.. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.అయితే టాలీవుడ్‌ లో ప్ర‌స్తుతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన పూనమ్.. జానీని మాస్ట‌ర్ అని పిల‌వ‌కండని పోస్ట్ చేసింది. అలా పిల‌వాలంటే క‌నీసం గౌర‌వం ఉండాలంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత సంచలన పోస్ట్ పెట్టింది. ఇప్పటికే డైరెక్టర్ త్రివిక్రమ్ పై అనేక ఆరోపణలు చేసిన పూనమ్.. ఇప్పుడు మరోసారి పోస్ట్ చేసింది. కొన్నిసార్లు ఇన్ డైరెక్ట్ కామెంట్లు చేసినా.. ఇప్పుడు పేరు కూడా మెన్షన్ చేసింది. "త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పై ఇప్పటికే మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. కానీ నాతోపాటు చాలామందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు. దీంతో నా ఫిర్యాదును తిరస్కరించారు. ఆ తర్వాత నేను పెద్దలకు కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పుడైనా త్రివిక్రమ్‌ ను ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.అయితే ఈ వ్యవహారంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ.. నాకు తెలియదు. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఎందుకు ఇచ్చారు. మా కమిటీలో ఉన్న ఎర్ర డబ్బాలో ఫిర్యాదు వేసి ఉంటే స్పందించే వాళ్లం. పని జరిగేది. ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకోలేం. ఒకవేళ మా సంఘం వారికి ఫిర్యాదు ఇస్తే.. వారు మాకు ఫార్వర్డ్ చేస్తే పరిశీలించే వాళ్లం. ఇప్పటికైనా కంప్లయింట్ చేస్తే మీ చర్యలు తీసుకొంటాం అని అన్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>