MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఫిలిమ్ ఇండస్ట్రీలోకి నాగార్జున వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మార్కెట్ ఇంకా పూర్తిగా పెరగలేదు. దీనితో అతడితో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో చైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘తండేల్’ అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. అల్లు కాంపౌండ్ నిర్మిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ విజయం పై చైతన్య చాల ఆశలు పెట్టుకున్నాడు. సుమారు 7 నెలల క్రితం ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి క్రిస్మస్ రేస్ పై చైతన్య దృష్టి పెNAGACHAITANYA{#}Balakrishna;Ram Charan Teja;Naga Chaitanya;Akkineni Nagarjuna;shankar;Christmas;Makar Sakranti;Srikakulam;Chaitanya;Dil;Wagah;Chiranjeevi;Andhra Pradesh;December;Cinema;Newsరాజీ మార్గాన్ని ఎంచుకున్న తండేల్ !రాజీ మార్గాన్ని ఎంచుకున్న తండేల్ !NAGACHAITANYA{#}Balakrishna;Ram Charan Teja;Naga Chaitanya;Akkineni Nagarjuna;shankar;Christmas;Makar Sakranti;Srikakulam;Chaitanya;Dil;Wagah;Chiranjeevi;Andhra Pradesh;December;Cinema;NewsWed, 18 Sep 2024 10:08:00 GMTఫిలిమ్ ఇండస్ట్రీలోకి నాగార్జున వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మార్కెట్ ఇంకా పూర్తిగా పెరగలేదు. దీనితో అతడితో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో చైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘తండేల్’ అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది.



అల్లు కాంపౌండ్ నిర్మిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ విజయం పై చైతన్య చాల ఆశలు పెట్టుకున్నాడు. సుమారు 7 నెలల క్రితం ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి క్రిస్మస్ రేస్ పై చైతన్య దృష్టి పెట్టాడు. అయితే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఇప్పుడు ఆడేట్ పై దృష్టి పెట్టడంతో చైతన్య ప్లాన్ కు అడ్డుకట్ట పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.



శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో చరణ్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో చైతూ తన సినిమాకు సంబంధించి ఈ భారీ పోటీలో నిలబడకుండా మరొక డేట్ వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాను క్రిస్మస్ రేసు నుండి తప్పించి రాబోతున్న సంక్రాంతి రేసులోకి తీసుకు వద్దామని  ఆలోచనలు ఉన్నప్పటికీ సంక్రాంతి రేసులో చిరంజీవి ‘విశ్వంభర’ బాలకృష్ణ వెంకటేష్ ల సినిమాలు కూడ ఉండటంతో అంత భారీ మధ్య ‘తండేల్’ ను తీసుకురావడం కష్టం అని భావించిన ఈ మూవీ నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక రాజీ మార్గాన్ని అన్వేషించినట్లు వార్తలు వస్తున్నాయి.



తెలుస్తున్న సమాచారం ఈ మూవీ నిర్మాతల ఆలోచనలలో రిపబ్లిక్ డే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాఘా బోర్డర్ లో ఇటీవలే ఈసినిమాకు సంబంధించి ఒక కీలక సన్నివేశాన్ని షూటి చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘంటన ఆధారంగా ఈసినిమాను తీశారు అని అంటున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>