MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maheshf84f8883-ad84-44b4-9dfc-44f0dfcadaa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/maheshf84f8883-ad84-44b4-9dfc-44f0dfcadaa8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అంత గొప్ప క్రేజ్ కలిగిన ఈయన ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం విడుదల అmahesh{#}choudary actor;Shradda Kapoor;sree;Joseph Vijay;Prakash Raj;ramya krishnan;Box office;Music;trivikram srinivas;mahesh babu;rahul;Rahul Sipligunj;thaman s;Guntur;vijay kumar naidu;Prabhas;Cinemaరీజనల్ మూవీతోనే టాప్ ఫోర్ లో నిలిచిన మహేష్.. ఏకంగా ఆ రెర్ రికార్డ్..?రీజనల్ మూవీతోనే టాప్ ఫోర్ లో నిలిచిన మహేష్.. ఏకంగా ఆ రెర్ రికార్డ్..?mahesh{#}choudary actor;Shradda Kapoor;sree;Joseph Vijay;Prakash Raj;ramya krishnan;Box office;Music;trivikram srinivas;mahesh babu;rahul;Rahul Sipligunj;thaman s;Guntur;vijay kumar naidu;Prabhas;CinemaWed, 18 Sep 2024 19:56:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అంత గొప్ప క్రేజ్ కలిగిన ఈయన ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది.

ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD మూవీ నిలిచింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 183.20 గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా ... ఆ తర్వాత విజయ్ హీరోగా రూపొందిన గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

ఇక శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "స్త్రీ 2" మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 83.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ సినిమాలో జయరామ్ , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ , రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలలో నటించగా ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>