MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nayanthara-prabhudeva-simbu-ramalath-vignesh-shivan3df53cd8-fe24-4366-936c-83f0d6a93fb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nayanthara-prabhudeva-simbu-ramalath-vignesh-shivan3df53cd8-fe24-4366-936c-83f0d6a93fb2-415x250-IndiaHerald.jpgనయనతార కొరియోగ్రాఫర్.. దర్శకుడు.. నటుడు.. అయినటువంటి ప్రభుదేవా కంటే ముందే మరో నటుడు అయినటువంటి శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అంతే కాదు అప్పట్లో వీరికి సంబంధించిన ఎన్నో సీక్రెట్ ఫోటోలు కూడా బయటపడ్డాయి. కానీ నయనతార మాత్రం శింబుతో ఉన్న రిలేషన్ ని బహిరంగంగా ఎక్కడ బయట పెట్టలేదు. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ చెడిందో ఏమో కానీ శింబుకి బ్రేకప్ చెప్పేసింది. ఇక కొంతమంది కోలీవుడ్ జనాలు మాత్రం నయనతార శింబు కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సమయంలో ప్రభుదేవతో నయనతార క్లోజ్ NAYANTHARA; PRABHUDEVA; SIMBU; RAMALATH; VIGNESH SHIVAN{#}Prabhu Deva;nayantara;Kollywood;Wife;Vignesh Shivan;Silambarasan;Director;prema;marriage;Love;Cinema;mediaప్రభుదేవా జీవితంతో ఆడుకున్న నయనతార.. పక్కా ప్లాన్ తో ట్రాప్ చేసిందా..?ప్రభుదేవా జీవితంతో ఆడుకున్న నయనతార.. పక్కా ప్లాన్ తో ట్రాప్ చేసిందా..?NAYANTHARA; PRABHUDEVA; SIMBU; RAMALATH; VIGNESH SHIVAN{#}Prabhu Deva;nayantara;Kollywood;Wife;Vignesh Shivan;Silambarasan;Director;prema;marriage;Love;Cinema;mediaWed, 18 Sep 2024 09:19:00 GMT- నయనతార కోసం భార్యకి అన్యాయం..
- నయనతారపై ప్రభుదేవా భార్య శాపనార్థాలు
- నయనతార ఎఫైర్ తో ప్రభుదేవా కెరీర్ క్లోజ్..

 సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల మధ్య ప్రేమ డేటింగ్ అనేవి ఉంటాయి.. ఇక వీరందరిలో నయనతార కంటే ముందే ప్రభుదేవాకు రమాలత్ తో పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎంతో సాఫీగా సాగిపోయిన వీరి జీవితంలోకి నయనతార ఎలా ఎంట్రీ ఇచ్చింది.. ఎంతో గాఢంగా ప్రేమించుకున్న నయనతార ప్రభుదేవాల బంధం ఎక్కడ చెడింది అనే సంచలన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 నయనతార ప్రభుదేవా లవ్:

 నయనతార కొరియోగ్రాఫర్.. దర్శకుడు.. నటుడు.. అయినటువంటి ప్రభుదేవా కంటే ముందే మరో నటుడు అయినటువంటి శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అంతే కాదు అప్పట్లో వీరికి సంబంధించిన ఎన్నో సీక్రెట్ ఫోటోలు కూడా బయటపడ్డాయి. కానీ నయనతార మాత్రం శింబుతో ఉన్న రిలేషన్ ని బహిరంగంగా ఎక్కడ బయట పెట్టలేదు. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ చెడిందో ఏమో కానీ శింబుకి బ్రేకప్ చెప్పేసింది. ఇక కొంతమంది కోలీవుడ్ జనాలు మాత్రం నయనతార శింబు కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సమయంలో ప్రభుదేవతో నయనతార క్లోజ్ గా ఉండడం చూసి శింబు నయన్ కి బ్రేకప్ చెప్పారనే టాక్ వినిపించింది. అలా ప్రభుదేవాకు పెళ్లయి పిల్లలు ఉన్నారనే సంగతి తెలిసి కూడా ప్రభుదేవాని ట్రాప్ చేసి లవ్లో పడేసింది నయనతార. అలా వీరిద్దరూ 2009 నుండి సహజీవనం చేసినట్టు కోలీవుడ్లో ప్రచారం జరిగింది.అయితే ఈ విషయం తెలిసి ప్రభుదేవా భార్య రమాలత్ న్యాయ పోరాటం చేసి కోర్టుకెక్కింది. కానీ అప్పటికే ప్రభుదేవా నయనతారతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోవడం వల్ల భార్యని దూరం చేసుకున్నాడు.అలా 2011లో భార్యతో విడాకులు తీసుకున్నాడు ప్రభుదేవా.ఇక ఈ విడాకులైన సమయంలో ప్రభుదేవా భార్య నయనతారపై ఎన్నో షాకింగ్ కామెంట్లు చేసింది. అలా నయనతార తో పెళ్లికి లైన్ క్లియర్ అయింది అనుకున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య కూడా బంధం చెడి వీళ్లు విడిపోయారు.

 నయనతార ప్రభుదేవా ల బ్రేకప్..

 ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ప్రభుదేవా నయనతారలు విడిపోవడం చాలా మంది అభిమానులని బాధపెట్టింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ప్రభుదేవా పెట్టిన కొన్ని కండిషన్లే అని అప్పట్లో ఓ టాక్ వినిపించింది. నయనతారని మతం మార్చుకోవాలని ప్రభుదేవా కండిషన్ పెట్టారట.అంతేకాకుండా తన మొదటి భార్యతో పుట్టిన ఇద్దరు కొడుకులు కూడా పెళ్లయ్యాక మన దగ్గరే ఉంటారు అని చెప్పడంతో నయనతారకు ఈ విషయం నచ్చలేదట. మరీ ముఖ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పి పిల్లల బాధ్యత తీసుకోవాలి అని చెప్పడంతో నయనతార ప్రభుదేవతో జీవితాంతం కలిసి ఉండలేక బ్రేకప్ చెప్పేసిందట.. అలా మీడియాలో ఒక సంచలనం సృష్టించిన నయనతార ప్రభుదేవాలు చివరికి విడిపోయారు.

 విజ్ఞేష్ తో పెళ్లి

 నయనతార ప్రభుదేవా తో బ్రేకప్ చేసుకున్నాక యంగ్ డైరెక్టర్ అయినటువంటి విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.అలా దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమలో ఉండి ఆయన్ని పెళ్లి చేసుకుంది.ఇక నయనతార విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సమయంలో కూడా ప్రభుదేవా మొదటి భార్య నయనతార పై శాపనార్థాలు పెట్టింది.నా లైఫ్ నాశనం చేసిన నయనతార జీవితం నాశనం అవుతుంది అని ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో  మీడియా లో చాలా వైరల్ గా మారాయి. ఇక నయనతార లాగే ప్రభుదేవా కూడా ఫిజియోథెరపిస్టు హిమాని సింగ్ ని 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈ మధ్యనే ఒక పాప కూడా పుట్టింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>