Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefaf45aa1-5e7e-431b-903d-4ee9b1d0cea3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefaf45aa1-5e7e-431b-903d-4ee9b1d0cea3-415x250-IndiaHerald.jpgయువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబర్‌లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రం సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ని రూపొందించబడింది. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్(కళ్యాణ్ శంకర్), సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'టిల్ స్క్వేర్'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్‌గా రూపొందించిన 'మ్యాడ్ స్క్వేర్'తో రాబోతున్నారు. నార్నే నితినsocialstars lifestyle{#}sithara;Tsunami;Naveen Nuli;ram pothineni;Pooja Hegde;Music;Hero;Chitram;kalyan;News;Cinema'మ్యాడ్ స్క్వేర్' స్టన్నింగ్ పోస్టర్ అదిరిందిగా..!!'మ్యాడ్ స్క్వేర్' స్టన్నింగ్ పోస్టర్ అదిరిందిగా..!!socialstars lifestyle{#}sithara;Tsunami;Naveen Nuli;ram pothineni;Pooja Hegde;Music;Hero;Chitram;kalyan;News;CinemaWed, 18 Sep 2024 13:45:00 GMTయువ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన 'మ్యాడ్' చిత్రం 2023 అక్టోబర్‌లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రం సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ని  రూపొందించబడింది. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్(కళ్యాణ్ శంకర్), సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'టిల్ స్క్వేర్'కి రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఇప్పుడు, ఆయన తన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్‌గా రూపొందించిన 'మ్యాడ్ స్క్వేర్'తో రాబోతున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగారు. కథానాయికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.మ్యాడ్ నెస్' ఇంకా పూర్తి కాలేదు అని తెలిపిన మేకర్స్.. ఈసారి 'మ్యాడ్ నెస్' రెట్టింపు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే, ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి.. థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది. ఇటీవల ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా రూపొందించిన 'టిల్లు స్క్వేర్' ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో.'మ్యాడ్'కి సీక్వెల్‌గా రూపొందించిన 'మ్యాడ్ స్క్వేర్' కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు విశ్వసిస్తున్నారు.

కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాడ్ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొంతకాలంగా మ్యాడ్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు మ్యాడ్ సినిమా సీక్వెల్ ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. మళ్ళీ అదే దర్శకుడు, అదే కాస్ట్ తో, మరికొంతమంది కొత్త వాళ్ళని కూడా తీసుకొని మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ గా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.ఈ నేపథ్యంలో నార్నె నితిన్ హీరో గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న మాడ్ స్క్వేర్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ ఈనెల 20న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం లో సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ నేపథ్యంలోమ్యాడ్' కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు 'మ్యాడ్ స్క్వేర్' కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నందున, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సీక్వెల్‌తో ప్రేక్షకులకు థియేటర్లలో మ్యాడ్ మ్యాక్స్ వినోదాన్ని అందిస్తామని వాగ్దానం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>