EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/cbne94504cf-513f-4663-83af-f135913b46c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/cbne94504cf-513f-4663-83af-f135913b46c3-415x250-IndiaHerald.jpgఏపీలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత అనుభవశాలి అయినా చంద్రబాబు ఈ గండం నుంచి గట్టెక్కడానికి చాలా కష్టపడాల్సిందే. అసలే మూలిగే నక్కలా ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంటే దాని మీద తాటిపండు పడినట్లు భారీ వానలు, వరదలు వచ్చి పడ్డాయి. దీంతో వేలాది కోట్లలో నష్టం వచ్చింది. రాష్ట్రం అతలాకుతలం అయింది. బాధతులు లక్షల్లో ఉన్నారు. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం సాయం ఇంకా ఎంతో తెలియలేదు. కానీ వరదల వచ్చి సర్వం కోల్పోయిన వారు గత 20 రోజులుగా దైన్యంలో ఉన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయడం భావ్యం కాదని cbn{#}Amaravati;YCP;Andhra Pradesh;Letter;TDP;CBN;Governmentజీతాలకు డబ్బుల్లేవు! చేతులు ఎత్తేసిన చంద్రబాబు?జీతాలకు డబ్బుల్లేవు! చేతులు ఎత్తేసిన చంద్రబాబు?cbn{#}Amaravati;YCP;Andhra Pradesh;Letter;TDP;CBN;GovernmentWed, 18 Sep 2024 12:27:39 GMTఏపీలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత అనుభవశాలి అయినా చంద్రబాబు ఈ గండం నుంచి గట్టెక్కడానికి చాలా కష్టపడాల్సిందే. అసలే మూలిగే నక్కలా ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంటే దాని మీద తాటిపండు పడినట్లు భారీ వానలు, వరదలు వచ్చి పడ్డాయి. దీంతో వేలాది కోట్లలో నష్టం వచ్చింది. రాష్ట్రం అతలాకుతలం అయింది.


బాధతులు లక్షల్లో ఉన్నారు. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం సాయం ఇంకా ఎంతో తెలియలేదు. కానీ వరదల వచ్చి సర్వం కోల్పోయిన వారు గత 20 రోజులుగా దైన్యంలో ఉన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయడం భావ్యం కాదని టీడీపీ కూటమి ప్రభుత్వం భావించి.. వరద సాయాన్ని ప్రకటించింది.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గత ప్రభుత్వం మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను లెక్కా పత్రం లేకుండా ఖర్చు చేసిందని విమర్శించారు. ప్రకకృతి వైపరిత్యాలకు కూడా వేలాది కోట్లు గతంలో రిలీజ్ చేస్తే వాటిని కూడా ఏ లెక్కా లేకుండా ఖర్చు చేశారని అన్నారు.


 అలా నాచురల్ కల్మాసీట్ కింద ఉన్న ఫండ్స్ కూడా ఏమీ లేకుండా పోయాయని అన్నారు. కేంద్రం అయితే తమ వద్ద డబ్బులు ఉన్నాయని అనుకుంటుందని.. అయినా తాము ఎంతటి దీనావస్థలో ఉన్నమో వారికి తెలియజేస్తూ లేఖ రాస్తున్నాం మని చంద్రబాబు అన్నారు. ఏపీ లో ఆర్థిక పరిస్థితి చూస్తే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని బాంబ్ పేల్చారు.


కేంద్రం ఆదుకోవాలని అందుకే కోరుతున్నామని అన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులే అవసరం లేదని వైసీపీ ప్రభుత్వం రాసిచ్చిందని.. అలాగే పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వేరే వాటికి డైవర్ట్ చేసి వాడేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇవన్నీ పక్కన  పెడితే జీతాలకు డబ్బులు లేవని అన్నది చంద్రబాబు తాజాగా చెబుతున్న మాట. మరి మరో పన్నెండు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సామాజిక పెన్షన్లకు వేలాది కోట్లను ఎలా సర్దుబాటు చేస్తోరో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>