PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan-became-a-hero-only-because-of-his-personality024208c8-64b7-4e17-8b79-4c59d9b2ed14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan-became-a-hero-only-because-of-his-personality024208c8-64b7-4e17-8b79-4c59d9b2ed14-415x250-IndiaHerald.jpgఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి ప్రశంసల వర్షం కురిపిస్తూ తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని పింఛన్ పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పింఛన్ల పెంపును అమలు చేశామని పవన్ అన్నారు. సంక్షేమం విషయంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని ఆయన చెప్పుకొచ్చారు. pawan kalyan{#}Varsham;YCP;Deputy Chief Minister;media;CBN;kalyan;CM;Government;historyఆ విషయంలో చంద్రబాబు నన్ను ఆశ్చర్యపరుస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!ఆ విషయంలో చంద్రబాబు నన్ను ఆశ్చర్యపరుస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!pawan kalyan{#}Varsham;YCP;Deputy Chief Minister;media;CBN;kalyan;CM;Government;historyWed, 18 Sep 2024 19:40:00 GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి ప్రశంసల వర్షం కురిపిస్తూ తాజాగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని పింఛన్ పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పింఛన్ల పెంపును అమలు చేశామని పవన్ అన్నారు. సంక్షేమం విషయంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని ఆయన చెప్పుకొచ్చారు.
 
గతంలో గవర్నమెంట్ ఉద్యోగులకు వేతనాలు సరైన సమయానికి వచ్చేవి కావని పంచాయితీలు నిర్జీవమవుతున్న తరుణంలో వాటికి ఏకంగా 1452 కోట్ల రూపాయలు సీఎం ఇచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ సర్పంచ్ లు ఉన్న పంచాయితీలకు సైతం నిధులు ఇస్తామని అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు లాభం జరుగుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
 
గత ప్రభుత్వానికి అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలని అనిపించిందని పవన్ ప్రశ్నించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టంను రద్దు చేసి పేదల యొక్క భూములను చంద్రబాబు కాపాడారని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఓపిక నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 25 సంవత్సరాల యువకుడు సైతం చంద్రబాబులా కష్టపడలేడని ఆయన పేర్కొన్నారు.
 
చంద్రబాబు నాయుడు బురదలో దిగి నడుస్తున్నా వైసీపీ విమర్శలు చేస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసే మంచి పనులను గుర్తించి అండగా నిలుస్తామని పవన్ కామెంట్లు చేశారు. పవన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పవన్ త్వరలో వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని భారీ విజయాలను అందుకోవాలని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజకీయంగా, సినిమాల్లో విజయం సాధించిన అతికొద్ది మందిలో పవన్ ఒకరని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>