Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----454eb86c-bcff-4c74-a7bf-d93fa15b2188-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----454eb86c-bcff-4c74-a7bf-d93fa15b2188-415x250-IndiaHerald.jpgనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. వందల సినిమాల్లో హీరోగా నటించిన సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ హృదయానికి చేరువయ్యాడు. అంతే కాదు ఇక నిన్నటి తరానికి రాముడు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అంటే అందరికీ కూడా ఎన్టీఆర్ గుర్తుకు వస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇతిహాస పాత్రలు పోషించే ఇక ఆ పాత్రకు ప్రాణం పోయడంలో ఎన్టీఆర్ను మించిన వారు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణుడిగా రాముడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా విలక్షణమైన ఇతిహాస పాత్రలో నటించిఎన్టీఆర్{#}krishnudu;yogi;court;Blockbuster hit;NTR;Telugu;Cinemaఆ ఒక్క సీన్ కోసం.. ఎన్టీఆర్ మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగారట తెలుసా?ఆ ఒక్క సీన్ కోసం.. ఎన్టీఆర్ మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగారట తెలుసా?ఎన్టీఆర్{#}krishnudu;yogi;court;Blockbuster hit;NTR;Telugu;CinemaWed, 18 Sep 2024 14:57:00 GMTనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. వందల సినిమాల్లో హీరోగా నటించిన సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ  హృదయానికి చేరువయ్యాడు. అంతే కాదు ఇక నిన్నటి తరానికి రాముడు కృష్ణుడు  అంటే ఎలా ఉంటాడు అంటే అందరికీ కూడా ఎన్టీఆర్ గుర్తుకు వస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇతిహాస పాత్రలు పోషించే ఇక ఆ పాత్రకు ప్రాణం పోయడంలో ఎన్టీఆర్ను మించిన వారు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 కృష్ణుడిగా రాముడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా విలక్షణమైన ఇతిహాస పాత్రలో నటించి ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు.. ఇక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చెరిగిపోని స్థానాన్ని కల్పించింది. అయితే ఎప్పుడు విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ అభిమానులు ఆదరిస్తూ ఉండేవారు సీనియర్ ఎన్టీఆర్. అయితే ఇలా ప్రయోగాలు చేసిన సమయంలో కొన్ని కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే తాతమ్మ కల అనే సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీన్స్ డైలాగ్స్ ఉన్నాయని.. 50 రోజుల తర్వాత ఆ సినిమా బ్యాన్ చేసింది ప్రభుత్వం.


 అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాలలో యోగి వేమన కూడా ఒకటి. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశం గురించి మూడేళ్ల పాటు సీనియర్ ఎన్టీఆర్ కోర్టు చుట్టూ తిరిగారట. వేమన క్యారెక్టర్ తన వదినను నగ్నంగా చూసే సీన్ ఒకటి ఉంటుంది. అయితే ఆ సీన్ ఎడిట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు కోరింది. కానీ యోగివేమన అలా యోగిగా ఎలా మారాడు అనేదానికి ఆ సీనే ప్రధాన కారణం అని.. శృంగారం కోసమో.. డబ్బులు కోసమో ఈ సీన్ పెట్టలేదని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సెన్సార్ బోర్డు వినకపోవడంతో సెన్సార్ బోర్డుపై కేసు వేసి మూడేళ్ల పాటు కోర్టు చుట్టూ తిరిగారట ఎన్టీఆర్. ఆ తర్వాత రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు సీనియర్ ఎన్టీఆర్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>