MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------d2928c03-5db4-4b68-91f6-37cd34d9e1f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------d2928c03-5db4-4b68-91f6-37cd34d9e1f6-415x250-IndiaHerald.jpgనటి శ్రద్ధా ఆర్య గురించి మీరు ఎక్కడో ఒకచోట వినే ఉంటారు. 2006లో "కల్వనిన్ కదాలి" అనే తమిళ సినిమాతో ఈ అమ్మడు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ ని ఉర్రుతలూగించింది. 2007లో "గొడవ" అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించగా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయిశ్రద్ధా ఆర్య {#}Rocky;arya;prem;rahul;rani;Rahul Sipligunj;Shradda Kapoor;Aryaa;Chitram;Punjabi;Tamil;bollywood;Beautiful;prema;Love;marriage;Heroine;Cinemaతల్లి కాబోతున్న అందాల తార.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?తల్లి కాబోతున్న అందాల తార.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?శ్రద్ధా ఆర్య {#}Rocky;arya;prem;rahul;rani;Rahul Sipligunj;Shradda Kapoor;Aryaa;Chitram;Punjabi;Tamil;bollywood;Beautiful;prema;Love;marriage;Heroine;CinemaWed, 18 Sep 2024 11:45:00 GMTనటి శ్రద్ధా ఆర్య గురించి మీరు ఎక్కడో ఒకచోట వినే ఉంటారు. 2006లో "కల్వనిన్ కదాలి" అనే తమిళ సినిమాతో ఈ అమ్మడు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ ని ఉర్రుతలూగించింది. 2007లో "గొడవ" అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించగా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకి ఇక్కడ వరుసగా రోమియో, కోతిమూక లాంటి సినిమాల్లో అవకాశం వచ్చింది.

తెలుగులో మాత్రమే కాకుండా ఈ అమ్మడు కన్నడ, పంజాబీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. కానీ ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని దక్కించుకోలేక పోయింది. బాలీవుడ్‌లో చివరి సారిగా రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. ఆ తరువాతి క్రమంలో బుల్లితెరవైపు వెళ్లి అక్కడ బాగానే నిలదొక్కుకుంది ఈ హాట్ బ్యూటీ. ‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా 2021 నవంబర్‌లో రాహుల్ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకొని పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ తో బిజీ బిజీగా ఉంటోంది.

ఈ నేపథ్యంలోనే శ్రద్ధా ఆర్య ప్రేక్షకులకు ఓ శుభవార్త చెప్పింది. త్వరలో తాను అమ్మగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు ఒక బ్యూటిఫుల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకొచ్చింది. దాంతో ఈ వీడియోని చూడడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్యకు శుభాకాంక్షల వెల్లువ ఎత్తుతున్నారు. ఇకపోతే న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధ 2021 నవంబర్‌లో రాహుల్ నాగల్‌ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకోగా ఇప్పుడీ మూడేళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను త్వరలో కనబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>