MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul6b34bd9c-ee93-44e8-8bf6-638f1427a2a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul6b34bd9c-ee93-44e8-8bf6-638f1427a2a1-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమాలలో కాకుండా ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తుంది. ఆఖరుగా ఈమె తెలుగులో కొండపొలం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలో కూడా రకుల్ నటించలేదు. ఈమె తన కెరియర్లో ఓ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను మిస్ చేసుకుంది. ఈ విషrakul{#}rakul preet singh;srinu vytla;Mr Perfect;Box office;Prabhas;MS Dhoni;Ram Charan Teja;Telugu;Tollywood;Hindi;Tamil;Cinemaపాపం రకుల్.. చివరి వరకు వచ్చి ఏకంగా అన్ని బ్లాక్ బాస్టర్స్ చేసుకుందిగా..?పాపం రకుల్.. చివరి వరకు వచ్చి ఏకంగా అన్ని బ్లాక్ బాస్టర్స్ చేసుకుందిగా..?rakul{#}rakul preet singh;srinu vytla;Mr Perfect;Box office;Prabhas;MS Dhoni;Ram Charan Teja;Telugu;Tollywood;Hindi;Tamil;CinemaWed, 18 Sep 2024 13:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమాలలో కాకుండా ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తుంది. ఆఖరుగా ఈమె తెలుగులో కొండపొలం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమాలో కూడా రకుల్ నటించలేదు.

ఈమె తన కెరియర్లో ఓ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను మిస్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకుంది. రకుల్ తాజాగా మాట్లాడుతూ... కెరియర్ ప్రారంభంలో ప్రభాస్ హీరోగా రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. నాపై నాలుగు రోజుల షూటింగ్ను కూడా పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వారు నన్ను ఆ సినిమా నుండి తీసేశారు. ఇక ఆ సినిమా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే నేను రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో నాకు హిందీ సినిమా అయినటువంటి ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది.

అప్పటికి బ్రూస్ లీ సినిమాకు సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉన్నాయి. దానితో నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది అని రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే రకుల్ కెరియర్ ప్రారంభంలో చేతి నుండి జారిపోయిన మిస్టర్ పర్ఫెక్ట్ , ఆ తర్వాత ఈమె అవకాశాన్ని వదులుకున్న ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>