PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidus-mistakes-in-politicsb11d8f1b-00ed-4cdc-90f4-e1ba78281996-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidus-mistakes-in-politicsb11d8f1b-00ed-4cdc-90f4-e1ba78281996-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్నికలకు ముందు ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ జారీ చేసిన మెమో ప్రకారం రాష్ట్రంలో మరో కొత్త స్కీమ్ దిశగా అడుగులు పడుతున్నాయి. chandrababu naidu{#}vidya;Government;job;CBN;Andhra Pradeshఆ నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్ పొందే ఛాన్స్!ఆ నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్ పొందే ఛాన్స్!chandrababu naidu{#}vidya;Government;job;CBN;Andhra PradeshWed, 18 Sep 2024 07:42:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎన్నికలకు ముందు ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ జారీ చేసిన మెమో ప్రకారం రాష్ట్రంలో మరో కొత్త స్కీమ్ దిశగా అడుగులు పడుతున్నాయి.
 
వేద విద్య చదివి ఉద్యోగం లేని యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇవ్వగా ఆ హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. వేద విద్య చదివినా ఉద్యోగం సాధించని వ్యక్తుల వివరాలను సేకరించాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వేద విద్య చదివిన విద్యార్థులకు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి.
 
అయితే ఈ నిరుద్యోగ భృతిని పొందే వాళ్లు తాము ఎక్కడా ఉద్యోగం చేయడం లేదని స్వీయ హామీ పత్రాన్ని సైతం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సైతం నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కూటమి ఘన విజయానికి ఈ హామీ సైతం కారణమని చెప్పవచ్చు. 2014లో సైతం నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చివరి ఆరు నెలలు మాత్రమే అమలు చేసింది.
 
అయితే పథకాల అమలు ఆలస్యం కావడం వల్ల నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుందనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతి పథకాన్ని వేగంగా అమలు చేస్తే మాత్రం కూటమికి ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>