DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi7aa3d27e-0c25-4f3c-a2fd-d8cf6bfa89e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi7aa3d27e-0c25-4f3c-a2fd-d8cf6bfa89e6-415x250-IndiaHerald.jpgదేశంలో జమ్మూ కశ్మీర్ , హరియాణా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుగున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. బుధవారం జమ్మూ కశ్మీర్ లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన తర్వాత.. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుది. ఈ పరిస్థితుల్లో మరోసారి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తెరమీదకి వచ్చింది. గత లోక్ సభ ఎన్నికల సందర్భmodi{#}Amith Shah;Ram Madhav;Jharkhand;central government;Narendra Modi;Bharatiya Janata Party;Minister;wednesday;Elections;Assembly;Congressమోదీ ప్రధానిగా అయిదేళ్లు ఉండరా? బాంబ్ పేల్చిన అమిత్ షా..!మోదీ ప్రధానిగా అయిదేళ్లు ఉండరా? బాంబ్ పేల్చిన అమిత్ షా..!modi{#}Amith Shah;Ram Madhav;Jharkhand;central government;Narendra Modi;Bharatiya Janata Party;Minister;wednesday;Elections;Assembly;CongressWed, 18 Sep 2024 14:42:00 GMTదేశంలో జమ్మూ కశ్మీర్ , హరియాణా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుగున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.  బుధవారం జమ్మూ కశ్మీర్ లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన తర్వాత.. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుది.


ఈ పరిస్థితుల్లో మరోసారి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తెరమీదకి వచ్చింది. గత లోక్ సభ ఎన్నికల సందర్భంలోను మోదీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ అది సాధ్య పడలేదు. పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ టెర్మ్ ఎన్నికలను జమిలి పద్దతిలోనే నిర్వహిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.


ఎట్టకేలకు ఈ కమిటీ రిపోర్టు ఇవ్వడంతో కేంద్రం వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై ముందడుగు వేయబోతుంది. ఈ మేరకు బై ఎలక్షన్లు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అమిత్ షా వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.


దేశ వ్యాప్తంగా ఒకే సారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. దీనిపై హోం మంత్రి క్లారిటీ కూడా ఇచ్చారు. మోదీ ప్రస్తుత ప్రభుత్వంలోనే జమిలి ఎన్నికల క్రతువును నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. మోదీ హ్యాట్రి్ సాధించి వంద రోజులు పూర్తైన సందర్భంగా దిల్లీలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కనుక జరిగితే మోదీ ప్రధానిగా ఐదేళ్లు చేపట్టకుండానే మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>