MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈనెల 27న విడుదల కాబోతున్న ‘దేవర’ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన మూవీ ‘అరవింద సమేత’ విడుదలైన 6 సంవత్సరాల గ్యాప్ తరువాత తారక్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈమూవీ కలక్షన్స్ రికార్డులను బట్టి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ ఇండస్ట్రీ వర్గాలకు అర్థం అవుతుంది అన్న ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా 13వందల కోట్లు వసూలు చేసినప్పటికీ ఆ క్రెడిట్ ను తారక్ చరణ్ రాజమౌళి లతో షేర్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందిJUNIOR NTR{#}Prabhas;Ram Charan Teja;ramaraju;siddhu;Komaram Bheem;Rajamouli;Jr NTR;sandeep;Industry;Alia Bhatt;India;Cinemaదేవర రికార్డుల పై పెరిగిపోతున్న ఆశక్తి !దేవర రికార్డుల పై పెరిగిపోతున్న ఆశక్తి !JUNIOR NTR{#}Prabhas;Ram Charan Teja;ramaraju;siddhu;Komaram Bheem;Rajamouli;Jr NTR;sandeep;Industry;Alia Bhatt;India;CinemaTue, 17 Sep 2024 10:00:00 GMTఈనెల 27న విడుదల కాబోతున్న ‘దేవర’ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన మూవీ ‘అరవింద సమేత’ విడుదలైన 6 సంవత్సరాల గ్యాప్ తరువాత తారక్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఈమూవీ కలక్షన్స్ రికార్డులను బట్టి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ ఇండస్ట్రీ వర్గాలకు అర్థం అవుతుంది అన్న ప్రచారం జరుగుతోంది.



‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా 13వందల కోట్లు వసూలు చేసినప్పటికీ ఆ క్రెడిట్ ను తారక్ చరణ్ రాజమౌళి లతో షేర్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ నటించిన కొమరం భీమ్ పాత్ర రామ్ చరణ్ నటించిన రామరాజు పాత్ర ముందు తేలిపోయింది అంటూ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగిన విషయం తెలిసిందే. దీనితో ‘దేవర’ మూవీ రికార్డులు జూనియర్ స్థాయికి పరీక్షగా మారాయి.



ఇప్పటికే ప్రభాస్ రెండు సార్లు 1000 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకోవడంతో కనీసం తారక్ ‘దేవర’ 750 కోట్ల టార్గెట్ ను అయినా అందుకోగలదా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ‘దేవర’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ఈమూవీకి విడుదల కాకుండానే నెగిటివ్ ప్రచారం చేసే ఒక వర్గం సోషల్ మీడియాలో ఇప్పటికే రెడీగా ఉండటంతో జరుగుతున్న ఈపరిణామాలు ఈమూవీ బయ్యర్లతో పాటు తారక్ ను కూడ కలవర పెడుతున్నట్లు టాక్.



ఇప్పటికే నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయిన నేపధ్యంలో ‘దేవర’ మూవీకి ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా ఆటాక్ ఫలితం ఈమూవీ కలక్షన్స్ పై భారీ ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ పరిస్థితులు గమనించిన జూనియర్ కరణ్ జోహార్, అలియా భట్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, సందీప్ రెడ్డి వంగా తదితరులతో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ ‘దేవర’ ను 1000 కోట్ల మూవీగా మార్చడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు..  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>