PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp1ed96a57-b530-4578-b63b-f5f89eaad0a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp1ed96a57-b530-4578-b63b-f5f89eaad0a2-415x250-IndiaHerald.jpgఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలు గ్రామ వాలంటీర్లలో నెలకొన్నాయి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఇటీవల వాలంటీర్ వ్యవస్థ ను రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలtdp{#}rajendra prasad;babu rajendra prasad;TDP;YCP;Government;Panchayati;Andhra Pradesh;Minister;CMచంద్రబాబుకి వాలంటీర్లు షాక్?చంద్రబాబుకి వాలంటీర్లు షాక్?tdp{#}rajendra prasad;babu rajendra prasad;TDP;YCP;Government;Panchayati;Andhra Pradesh;Minister;CMTue, 17 Sep 2024 12:52:05 GMTఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలు గ్రామ వాలంటీర్లలో నెలకొన్నాయి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.  వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు.


 అయితే ఇటీవల వాలంటీర్ వ్యవస్థ ను రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తుండటంతో వాలంటీర్లు సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ వ్యవస్థ ను రద్దు చేయాలంటూ టీడీపీ నేత, పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే 2.60లక్షల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు.


వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడం దారుణమని పేర్కొన్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న తేదీ నుంచి జరగబోయే ఏపీ కేబినేట్ భేటీలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇంతలోనే రాజేంద్రప్రసాద్ వాలంటీర్లను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. వారిని వైట్ ఎలిఫెంట్స్ గా పేర్కొన్నారు. వారికి ఇచ్చే రూ.5వేలను పంచాయతీ కార్యదర్శులకు ఇస్తే నయమని.. వాలంటీర్ వ్యవస్థ దండగ అని అన్నారు. అంతే కాదు.. వాలంటీర్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దొంగతనాల కేసుల్లోను వాలంటీర్లు ఉన్నారని అంటున్నారు. దీంతో వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు.. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తమను మానసికంగా వేధించారని.. పలు జిల్లాల్లో వాలంటీర్లు ఉద్యమానికి దిగారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>