PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi-putin3a9c9dd8-7411-4711-adcb-fd3eabdf76b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi-putin3a9c9dd8-7411-4711-adcb-fd3eabdf76b9-415x250-IndiaHerald.jpgరష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ తీవ్ర మవుతుండగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ వెళ్లి.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ తో ముఖాముఖీ చర్చలు జరపడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసంతృప్తిగా ఉన్నారా? ఇది తెలిసే ఆయనకు వివరణ ఇచ్చేందుకు మోదీ హుటాహుటిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ను మాస్కోకు పంపారా? తాజా పరిణమాలు దీనినే సూచిస్తున్నాయి. ఈ నెల 12న దోభాల్ రష్యాలోనే సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లారు. అక్కడ పుతిన్ తో అంతర్గతంగా చర్చలు జరిపారు. ఆయన అధ్యక్షుడితో మాట్లాడిన వీడియోను అక్కడే వార్తా సంస్థ స్పుత్నిmodi; putin{#}ajith kumar;Ukraine;Ajit Pawar;Smart phone;war;Narendra Modi;European Union;Prime Minister;Moscow;Russiaమోదీపై కోపంగా ఉన్న పుతిన్? మనపై తీవ్ర ప్రభావం..!మోదీపై కోపంగా ఉన్న పుతిన్? మనపై తీవ్ర ప్రభావం..!modi; putin{#}ajith kumar;Ukraine;Ajit Pawar;Smart phone;war;Narendra Modi;European Union;Prime Minister;Moscow;RussiaTue, 17 Sep 2024 13:09:00 GMTరష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ తీవ్ర మవుతుండగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ వెళ్లి.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ తో ముఖాముఖీ చర్చలు జరపడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసంతృప్తిగా ఉన్నారా? ఇది తెలిసే ఆయనకు వివరణ ఇచ్చేందుకు మోదీ హుటాహుటిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ను మాస్కోకు పంపారా? తాజా పరిణమాలు దీనినే సూచిస్తున్నాయి.


ఈ నెల 12న దోభాల్ రష్యాలోనే సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లారు. అక్కడ పుతిన్ తో అంతర్గతంగా చర్చలు జరిపారు. ఆయన అధ్యక్షుడితో మాట్లాడిన వీడియోను అక్కడే వార్తా సంస్థ స్పుత్నిక్ విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. తన ఉక్రెయిన్ పర్యటన, జెలన్ స్కీ తో చర్చల సారాంశాన్ని మీకు వివరించేందుకు  ఆసక్తిగా ఉన్నట్లు ఫోన్ చర్చల్లో మోదీ మీకు ఇప్పటికే తెలియజేశారు. ఆ చర్చల గురించి మీకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తెలిజయేసేందుకు నన్ను ఇక్కడకి పంపారు. జెలన్ స్కీతో చర్చలు అంతరంగికంగా జరిగాయి. వారిద్దరూ మాట్లాడుకున్నారు.


జెలన్ స్కీ వెంట ఇద్దరు ఉన్నారు. ప్రధాని మోదీతో నేనున్నాను. చర్చలకు నేను ప్రత్యక్ష సాక్షిని అని దోభాల్ పుతిన్ కు తెలిపారు. ఆయన ఒక్కో మాట పట్టి మాట్లాడటం చూస్తే.. మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఏం మాట్లాడారో పుతిన్ కు వివరణ ఇచ్చినట్లుగా ఉందని.. వారిద్దరి సమావేశంపై రష్యా అధ్యక్షుడు అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతుందని నెటజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


వాస్తవానికి పుతిన్ తో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలున్న మోదీ.. ఉక్రెయిన్ యుద్ధం విరమించేలా ఆయనపై ఒత్తిడి తేవాలని అమెరికా, ఐరాపా దేశాలు బహిరంగంగానే కోరుతున్నాయి. ఈ యుద్ధంలో తామెవరి వైపు తాము ఉండమని మోదీ పదే పదే చెబుతున్నారు. జులై  8, 9 తేదీల్లో ఱసక్యాను సందర్శించి పుతిన్ తో చర్చలు జరిపారు. యుద్ధం జరుగుతుండగా ఆయన మాస్కో వెళ్లి పుతిన్ కు కలవడంపై జెలన్ స్కీ తో పాటు అమెరికా, ఐరోపా దేశాలు ఆక్షేపించాయి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>