MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-sef067a97-176b-4a21-82fe-792daa3f7577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-sef067a97-176b-4a21-82fe-792daa3f7577-415x250-IndiaHerald.jpgఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోల మధ్య ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ మారుతున్నట్టు కనబడుతోంది. ఇది మంచి శుభ పరిణామమే అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇద్దరు హీరోలు మధ్య ఎక్కువగా పోటి వాతావరణమే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అని చెప్పుకోవచ్చు. హీరోలు ఒకరికొకరు హెల్పింగ్ హ్యాండ్ అందించుకుంటున్నారు. ఒకరికొకరు పోటి అనుకుంటున్న హీరోలు కూడా సోదరభావంతో సర్దుకు పోవడం మనకి కనిపిస్తోంది. రీసెంట్‌గా సైమా అవార్డ్స్ వేదిక మీద విజయ్‌ దేవరకొండ, నాని కలిసి సందడి చేయడం మీరు చూసే ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు దాదాపుhero s{#}Nani;vedhika;Audience;Joseph Vijay;ajith kumar;Ajit Pawar;Industry;Cinemaజీవితం అంటే ఇదే... హీరోల మధ్య కాలిక్యులేషన్స్ మారుతున్నాయి!జీవితం అంటే ఇదే... హీరోల మధ్య కాలిక్యులేషన్స్ మారుతున్నాయి!hero s{#}Nani;vedhika;Audience;Joseph Vijay;ajith kumar;Ajit Pawar;Industry;CinemaTue, 17 Sep 2024 14:30:00 GMTఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోల మధ్య ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ మారుతున్నట్టు కనబడుతోంది. ఇది మంచి శుభ పరిణామమే అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇద్దరు హీరోలు మధ్య ఎక్కువగా పోటి వాతావరణమే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అని చెప్పుకోవచ్చు. హీరోలు ఒకరికొకరు హెల్పింగ్ హ్యాండ్ అందించుకుంటున్నారు. ఒకరికొకరు పోటి అనుకుంటున్న హీరోలు కూడా సోదరభావంతో సర్దుకు పోవడం మనకి కనిపిస్తోంది. రీసెంట్‌గా సైమా అవార్డ్స్ వేదిక మీద విజయ్‌ దేవరకొండ, నాని కలిసి సందడి చేయడం మీరు చూసే ఉంటారు. ఈ ఇద్దరు హీరోలు దాదాపు ఒకే జానర్ సినిమాలతో పోటి పడుతున్నారు.

అందుకే ఈ ఇద్దరి మధ్య పోటి ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ తాజాగా సదరు వేదికపై షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన ఎవడే సుబ్రమణ్యం సినిమా సమయంలో నాని తనకు ఎంతో సపోర్ట్ చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అందుకే ఇక మీదట నానిని అన్నా అనే పిలుస్తా అన్నారు విజయ్‌. ఈ కామెంట్స్ మీద స్పందించిన నాని, విజయ్‌ తపన ఉన్న యాక్టర్‌... తాను మరిన్ని విజయాలు అందుకుంటాడు అంటూ కితాబిచ్చారు. రీసెంట్‌ టైమ్స్‌లో యంగ్ హీరోలు విశ్వక్‌సేన్‌, సిద్దూ జొన్నలగడ్డ కూడా ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకున్న ఘటనలు మీరు చూసే ఉంటారు.

ఇలా ఒకరి సినిమాల ఈవెంట్స్‌కు మరొకరు అటెండ్ అవుతూ ప్రమోషన్స్‌కి మరింత బజ్‌ వచ్చేలా హెల్ప్ చేసుకుంటున్నారు. అలా యంగ్ హీరోలే మాత్రమే కాదండోయ్... టాప్‌ స్టార్స్ మధ్య కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. కోలీవుడ్‌లో విజయ్‌, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది అక్కడ. ది గోట్‌ ప్రమోషన్స్‌లో అజిత్ ప్రస్థావన మళ్లీ మళ్లీ రావడమే దానికి కారణం. అజిత్ నెక్ట్స్ సినిమాలో విజయ్‌ రిఫరెన్స్ ఉంటుందన్న టాక్ బలంగా వినబడుతోంది. ఇలా హీరోలు ఒకరికొకరు హెల్ప్‌ చేసుకోవటం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>