Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle41ec9c28-7d03-49b6-a55b-41d6a4797816-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle41ec9c28-7d03-49b6-a55b-41d6a4797816-415x250-IndiaHerald.jpgమహేష్‌ - రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 ఇప్పుడు యమాగా ట్రెండ్‌ అవుతోంది. సినిమా ఇంకా షురూ కానేలేదు.. అప్పుడే అంత జోరు ఏంటి? అనే అనుమానాలకు అసలు అవకాశమే లేకుండా ట్రెండ్‌ అవుతోంది ఈ హ్యాష్‌ట్యాగ్‌.ఈ సినిమా మహేష్‌కి ఎన్ని విధాలా స్పెషల్‌? రాజమౌళి ఏం చెప్పారు.? విన్నారుగా అదీ సంగతి.. మనం అప్‌డేట్లు అడిగితే కర్ర పట్టుకుంటారు కానీ,కొన్ని కొన్ని డయాస్‌ల మీద నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి చెప్పక తప్పడం లేదు రాజమౌళికి. అలా ఆయన ఎక్కడో చెప్పిన విషయాలనే ట్రెండ్‌ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.గుంటూరు కారం వచ్చిన ఏడాదsocialstars lifestyle{#}Rajamouli;India;Guntur;Red chilly powder;Manam;CinemaSSMB : మహేష్, రాజమౌళి మూవీ స్క్రిప్ట్ పేపర్ లీక్..!!SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్క్రిప్ట్ పేపర్ లీక్..!!socialstars lifestyle{#}Rajamouli;India;Guntur;Red chilly powder;Manam;CinemaTue, 17 Sep 2024 23:45:00 GMTమహేష్‌ - రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 ఇప్పుడు యమాగా ట్రెండ్‌ అవుతోంది. సినిమా ఇంకా షురూ కానేలేదు.. అప్పుడే అంత జోరు ఏంటి? అనే అనుమానాలకు అసలు అవకాశమే లేకుండా ట్రెండ్‌ అవుతోంది ఈ హ్యాష్‌ట్యాగ్‌.ఈ సినిమా మహేష్‌కి ఎన్ని విధాలా స్పెషల్‌? రాజమౌళి ఏం చెప్పారు.? విన్నారుగా అదీ సంగతి.. మనం అప్‌డేట్లు అడిగితే కర్ర పట్టుకుంటారు కానీ,కొన్ని కొన్ని డయాస్‌ల మీద నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి చెప్పక తప్పడం లేదు రాజమౌళికి. అలా ఆయన ఎక్కడో చెప్పిన విషయాలనే ట్రెండ్‌ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.గుంటూరు కారం వచ్చిన ఏడాదికైనా, మహేష్‌ మూవీ అనౌన్స్ మెంట్‌ వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాను చేయబోయే ఆఖరి రీజినల్‌ సినిమా కావడంతో గుంటూరు కారంలో మరీ మాస్‌ గా పెర్ఫార్మ్ చేశారు మహేష్‌.నెక్స్ట్ సినిమా కోసం అన్ని విధాలా కొత్తగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ఆ మధ్య డిక్షన్‌ క్లాసులకు హాజరయ్యారు. యాక్షన్‌ పరంగానూ, ఫిజిక్‌ పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెవర్‌ బిఫోర్‌ సీన్‌ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు.యాక్షన్‌ సన్నివేశాల్లోనూ ఇప్పుడు హై స్టాండర్డ్స్ మెయింటెయిన్‌ చేయనున్నారు జక్కన్న. ఫారిన్‌ ఆర్టిస్టులతో మహేష్ నటించడం కూడా ఓ రకంగా ఫస్ట్ టైమే. పీరియాడిక్‌ జోనర్‌ని తన కెరీర్‌లో ఇప్పటిదాకా టచ్‌ చేయనేలేదు సూపర్‌స్టార్‌.మహేష్‌ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమా ఇదే. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగనుంది. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్నాయి కాబట్టే, ప్రతి ఫ్రేమ్‌నీ ఆచీ తూచీ ప్లాన్‌ చేస్తున్నారట రాజమౌళి. అన్నీ కంప్లీట్‌ చేసి, ఈ ఇయర్‌ ఎండింగ్‌లోనో, నెక్స్ట్ఇయర్‌ స్టార్టింగ్‌లోనో గుడ్‌ న్యూస్‌ చెప్పేయండి బాస్‌ అని ఆయనకు రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.ఇదిలావుండగా ఈ సినిమాకు సంబంధించి ssmb29పేరుతో స్క్రిప్ట్ పేపర్ లతో కూడిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో స్టోరీ విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ- పి.ఎస్. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తుంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>