Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr6326cc7e-f30c-403e-9f7a-053223053392-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr6326cc7e-f30c-403e-9f7a-053223053392-415x250-IndiaHerald.jpgనందమూరి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మ్యాన్ ఆఫ్ మాసేస్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచమంతా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటన నైపుణ్యానికి సినీ ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు. అయితే చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈntr{#}Fidaa;Rajamouli;NTR;koratala siva;Cinema;Jr NTR;Telugu;september'దేవర' మూవీకి కొత్త టెన్షన్.. అదే జరిగితే ఓపెనింగ్ కి గండి పడ్డట్టే?'దేవర' మూవీకి కొత్త టెన్షన్.. అదే జరిగితే ఓపెనింగ్ కి గండి పడ్డట్టే?ntr{#}Fidaa;Rajamouli;NTR;koratala siva;Cinema;Jr NTR;Telugu;septemberTue, 17 Sep 2024 20:00:00 GMTనందమూరి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మ్యాన్ ఆఫ్ మాసేస్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచమంతా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటన నైపుణ్యానికి సినీ ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు.


 అయితే చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపద్యంలో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. అయితే భారీ బడ్జెట్ తో ఈ మూవీ వివిధ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. దీంతో దేవర మూవీకి భారీగానే ఓపెనింగ్స్ ఉంటాయని అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు.


 కానీ ఒక్క విషయం మాత్రం అటు తారక్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు అనే సందేహాలు తెరమీదకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భారీ వర్షాలు కారణంగా ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ వరదలు నేపథ్యంలో జనావాసాలు మొత్తం స్తంభించిపోయాయి. రోడ్లు బస్ స్టాప్లు రైల్వేస్టేషన్లో అన్ని జలమయమయ్యాయి.  అయితే సెప్టెంబర్ 26 - 28 మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం తుఫాన్ వల్ల భారీ వర్షపాతం ఉందని అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  సెప్టెంబర్ 27న దేవర సిరిమను రిలీజ్ చేస్తే మీకు ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే మాత్రం అది చివరికి మూవీ ఓపెనింగ్ కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>