MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedనవీన్ పొలిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న నవీన్ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. హీరోగా మంచి ఇమేజ్ ఉన్న కూడా నవీన్ పొలిశెట్టి సినిమా సినిమాకి చాలా గ్యాప్ వస్తోందని అంతా అనుకుంటున్నారు. ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదనే అపవాదు ఈ హీరోపైన ఉంది. అయితే కథల ఎంపికలో చాలా సెలక్టివ్ గా నవీన్ ఉన్నాడని కొంతమంది సినిమా విశ్లేషకులు అంటున్నారు. అయితే మరికొంతమంది విమర్శకNaveen Polishetty{#}kalyan;naveen polishetty;sithara;srinivas;Telugu;Industry;News;Geetha Arts;Nijam;Cinema;Successసినిమాలు లేకపోవడంతో పోలికేకలు పెడుతున్న నవీన్ పొలిశెట్టి?సినిమాలు లేకపోవడంతో పోలికేకలు పెడుతున్న నవీన్ పొలిశెట్టి?Naveen Polishetty{#}kalyan;naveen polishetty;sithara;srinivas;Telugu;Industry;News;Geetha Arts;Nijam;Cinema;SuccessMon, 16 Sep 2024 18:15:00 GMTనవీన్ పొలిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న నవీన్ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. హీరోగా మంచి ఇమేజ్ ఉన్న కూడా నవీన్ పొలిశెట్టి సినిమా సినిమాకి చాలా గ్యాప్ వస్తోందని అంతా అనుకుంటున్నారు. ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదనే అపవాదు ఈ హీరోపైన ఉంది. అయితే కథల ఎంపికలో చాలా సెలక్టివ్ గా నవీన్ ఉన్నాడని కొంతమంది సినిమా విశ్లేషకులు అంటున్నారు. అయితే మరికొంతమంది విమర్శకులు మాత్రం నవీన్ చాలా ఆటిట్యూడ్... అందుకే సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం లేదు అని చెప్పుకుంటున్నట్టు భోగట్టా!

ఈ నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి గతంలో ఎనౌన్స్ చేసిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాని పక్కన పెట్టాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో జోరుగా వినబడుతోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఎనౌన్స్ కాగా తరువాత ఎందుకనో హోల్డ్ లో పడింది. అయితే ఈ కథని అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి చేయబోతున్నాడనే ప్రచారం కూడా ఇపుడు నడుస్తోంది. ఇక ‘అనగనగా ఒక రాజు’ హోల్డ్ లో పడటంతో కళ్యాణ్ శంకర్ సితారలో ‘మ్యాడ్’ మూవీ చేసి సక్సెస్ అందుకున్న సంగతి విదితమే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ చేస్తున్నాడు.

ఇకపోతే తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నవీన్ పోలిశెట్టి యూఎస్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘ఆయ్’ మూవీ దర్శకుడు అంజి మణిపుత్ర దర్శకత్వంలో సినిమాకి నవీన్ పొలిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వినబడుతున్నాయి. గీతా ఆర్ట్స్ 2లో బన్నీవాస్ ఈ సినిమాని నిర్మించబోతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు ఈ వార్తలన్నీ నిజం కాదని మరికొంతమంది అంటున్నారు. నవీన్ తన ఆటిట్యూడ్ తోనే సినిమాలు వదులుకుంటున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ సినిమాలు లేకపోవడంతో నవీన్ పొలిశెట్టి పోలికేకలు పెడుతున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి మరి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>