NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/chaina71730931-e9b8-4390-b3cd-6f41b11ac0fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/chaina71730931-e9b8-4390-b3cd-6f41b11ac0fe-415x250-IndiaHerald.jpgవిచిత్రం అనే పదానికి చైనా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అందరూ చేసేలా కాకుండా ఏదో ఒకటి విచిత్రంగా చేస్తూ వార్తల్లోని వస్తూ ఉంటుంది. అయితే చైనాలో తిండి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ మనుషులు తినని జీవి అంటూ ఉండదు ఏకంగా పాములు, కప్పలు, బల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు తప్ప ఆ దేశంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్నింటినీ కూడా చైనా ప్రజలు తినేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఆహారపు అలవాటే అక్కడ ఎన్నో రోగాలకు కారణమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాchaina{#}Ginger;Coronavirusదరిద్రం అంటే ఇదే.. చైనా రైతుల విచిత్ర ప్రయోగం?దరిద్రం అంటే ఇదే.. చైనా రైతుల విచిత్ర ప్రయోగం?chaina{#}Ginger;CoronavirusMon, 16 Sep 2024 11:15:00 GMTవిచిత్రం అనే పదానికి  చైనా కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అందరూ చేసేలా కాకుండా ఏదో ఒకటి విచిత్రంగా చేస్తూ వార్తల్లోని వస్తూ ఉంటుంది. అయితే చైనాలో తిండి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ మనుషులు తినని జీవి అంటూ ఉండదు  ఏకంగా పాములు, కప్పలు, బల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు తప్ప ఆ దేశంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్నింటినీ కూడా చైనా ప్రజలు తినేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఆహారపు అలవాటే అక్కడ ఎన్నో రోగాలకు కారణమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎప్పటికప్పుడు చైనాలో కొత్త వైరస్ లు పుట్టుకు వస్తూ ఉంటాయి.


 ప్రపంచాన్ని సైతం భయం గుప్పెట్లోకి నెట్టిన కరోనా వైరస్ కూడా అటు చైనా సృష్టే అని చెప్పాలి. ఏకంగా ముందుగా కరోనా వైరస్ చైనాలో పుట్టింది. కానీ ఈ వైరస్ కు సంబంధించిన నిజాలు దాచడంతో చివరికి ఈ ప్రాణాంతకమైన ప్రపంచ దేశాలకు పాకిపోయి అందరిని భయాందోళనకు గురిచేసింది. అయితే అక్కడ ఆహారం తినే విషయంలోనే కాదు.. ఏకంగా పంటలు పండించే విషయంలో కూడా ఇలాంటి విచిత్రమైన పద్ధతులనే పాటిస్తూ ఉంటారు అన్న విషయం ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక ఘటన ద్వారా అందరికీ అర్థమవుతుంది.


 ఎందుకంటే అక్కడ అల్లం సాగు చేయడం కోసం.. రైతులందరూ కూడా వినూత్నమైన కాదు కాదు విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు  భూమిలో అల్లం కొమ్ములతో పాటు చనిపోయిన చేపలని కూడా వేసి పూడ్చుతూ  ఉన్నారు. అది కుళ్లిపోయి  ఎరువుగా మారి.. భూమికి మంచి సారాన్ని ఇస్తుంది అని ఇక అక్కడి రైతులు చెబుతున్నారు. అల్లం ఘాటు కూడా బాగుంటుంది అంటూ రైతులు చెబుతూ ఉండడం గమనార్హం. చనిపోయిన చేపల్ని పంట వేయడానికి ముందే కొని నిలువ చేసుకుంటున్నారట అక్కడి రైతులు. దీంతో చైనాలో అల్లం కి సమానంగానే అటు చనిపోయిన చేపలకి కూడా గిరాకీ పెరుగుతూ ఉండడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>