PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chanrababu-loss-2019-electionecss05c7fc53-a14f-4597-8bf8-61595c74a163-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chanrababu-loss-2019-electionecss05c7fc53-a14f-4597-8bf8-61595c74a163-415x250-IndiaHerald.jpg* 2014లో చంద్రబాబు చేసిన తప్పు అదే.. •చంద్రబాబు చేసిన తప్పే జగన్ కు అనుకూలంగా మారిందా.. •పడిన చోటే లేచి నిలబడ్డ చంద్రబాబు.. (ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ) ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే 2014లో ప్రజలు చంద్రబాబును విపరీతంగా నమ్మారు. కానీ 2019లో ఆయనను అత్యంత ఘోరంగా ఓడించారు. మరి దీనికి గల ప్రధాన కారణం ఏమిటి..? ఆయన చేసిన తప్పేమిటి..? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత తCHANRABABU;LOSS ;2019 ELECTIONECSS{#}Janasena;Telugu Desam Party;kalyan;Bharatiya Janata Party;India;CBN;Jagan;TDP2019 లో చంద్రబాబు ఓటమికి అదే కారణమా.?2019 లో చంద్రబాబు ఓటమికి అదే కారణమా.?CHANRABABU;LOSS ;2019 ELECTIONECSS{#}Janasena;Telugu Desam Party;kalyan;Bharatiya Janata Party;India;CBN;Jagan;TDPMon, 16 Sep 2024 10:01:00 GMT* 2014లో చంద్రబాబు చేసిన తప్పు అదే..

•చంద్రబాబు చేసిన తప్పే జగన్ కు అనుకూలంగా మారిందా..


•పడిన చోటే లేచి నిలబడ్డ చంద్రబాబు..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత 2014లో ముఖ్యమంత్రిగా  చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే 2014లో ప్రజలు చంద్రబాబును విపరీతంగా నమ్మారు. కానీ 2019లో ఆయనను అత్యంత ఘోరంగా ఓడించారు. మరి దీనికి గల ప్రధాన కారణం ఏమిటి..? ఆయన చేసిన తప్పేమిటి..? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత తొలి ఎన్నికలలో.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం - జనసేన - బిజెపి కూటమే అప్పుడు విజయం సాధించింది. నాడు కూటమికి 106 సీట్లు వస్తే ,వైసీపీకి 67 సీట్లు వచ్చాయి.

వైసిపికి అప్పటికే బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా కొత్త రాష్ట్రం ఏర్పడాలి అంటే దానిని నడపగల సామర్థ్యం,  కొత్త రాజధానిని నిర్మించగల దక్షత జగన్ కంటే కూడా అనుభవజ్ఞుడైన చంద్రబాబుకే ఉంటుందని జనం భావించారు.  అలాగే పవన్ కళ్యాణ్ మద్దతుతో కాపుల ఓటు , యువత ఓటు కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక మోడీ కరిష్మా కూడా వీరికి బాగా కలిసి వచ్చింది. అలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.

దీనికి తోడు ప్రజలతో మీ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటాను.. పగలూ రాత్రి కష్టపడి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాను అంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్పారు చంద్రబాబు. ఇక వాటిని బాగా నమ్మిన ప్రజలు చంద్రబాబును గద్దెనెక్కించారు. పైగా ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర చేస్తూ ఊరు వాడ ఇంటింటా తిరిగేటప్పటికీ సీను మొత్తం రివర్స్ అయ్యింది. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. నాటి ఎన్నికలలో టిడిపి పై నెగిటివ్ ఓటుతో పాటు పాదయాత్ర చేస్తూ ఒక్క ఛాన్స్ ఇప్పించండి అంటూ ప్రాధేయపడిన జగన్ కి కూడా ఒకసారి చూద్దామని ప్రజలు ఓటు వేశారు. అలా నాడు చంద్రబాబు ప్రజలకు ఏమి చేయకపోవడం వల్లే వారిలో వ్యతిరేకత ఏర్పడి జగన్ కి  అనుకూలంగా మారేలా చేశాయి. ఏది ఏమైనా నవ్యాంధ్రను నిర్మిస్తాడు అని ఆశలు పెట్టుకున్న వారి ఆశలు వమ్ము చేయడం వల్లే ఆయనకు మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. అలా 2019లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 2024లో అత్యంత ఘన విజయం సాధించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>