MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svsc45f8a334-193e-4d47-a2c5-63f8fb2cdfbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svsc45f8a334-193e-4d47-a2c5-63f8fb2cdfbd-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు కలిసిన నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు దాదాపుగా కనుమరుగయ్యాయి. అలాంటి సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించారు. ఇది ఆ సమయంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. ఈ మూవీ లో వెంకటేష్ కు జోడిగా అంజలి నటించగా , మహేష్ బాబు కు జోడిగా సమంత నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషనSvsc{#}rao ramesh;srikanth addala;Seethamma Vakitlo Sirimalle Chettu;dil raju;Prakash Raj;Samantha;anjali;Sri Venkateshwara Creations;Music;Telugu;Venkatesh;mahesh babu;Interview;Tollywood;Cinemaసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని దర్శకుడు వేరేలా ప్లాన్ చేశాడు.. కానీ నేనే మార్చేశాను.. దిల్ రాజు..!సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని దర్శకుడు వేరేలా ప్లాన్ చేశాడు.. కానీ నేనే మార్చేశాను.. దిల్ రాజు..!Svsc{#}rao ramesh;srikanth addala;Seethamma Vakitlo Sirimalle Chettu;dil raju;Prakash Raj;Samantha;anjali;Sri Venkateshwara Creations;Music;Telugu;Venkatesh;mahesh babu;Interview;Tollywood;CinemaMon, 16 Sep 2024 14:05:00 GMTచాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు కలిసిన నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు దాదాపుగా కనుమరుగయ్యాయి. అలాంటి సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించారు. ఇది ఆ సమయంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ. ఈ మూవీ లో వెంకటేష్ కు జోడిగా అంజలి నటించగా , మహేష్ బాబు కు జోడిగా సమంత నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు.

రావు రమేష్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది. అసలు ఈ మూవీ ని ముందు ఎలా అనుకున్నారు. తర్వాత ఎలాంటి మార్పులు అయ్యాయి. ఇలాంటి వివరాలను ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... శ్రీకాంత్ అడ్డాల ఓ రోజు నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్టోరీ లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. దానితో ఎవరితో చేయాలి అనుకుంటున్నావు అని అడిగాను.

అంతా కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఇది అలా వర్కౌట్ కాదు. స్టార్ హీరోలతో చేద్దాం అన్నాను. ఆ తర్వాత వెంకటేష్ ఓకే అయ్యాడు. ఆ తర్వాత పవన్ లాంటి హీరోను రెండవ పాత్రకు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత అనుకోకుండా మహేష్ ను కలవడం , ఈ కథను చెప్పడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దానితో మహేష్ బాబు కూడా ఈ సినిమాలో ఓకే అయ్యాడు. అలా ఈ సినిమాలోకి వెంకటేష్ , మహేష్ ఎంట్రీ ఇచ్చారు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>