SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india-vs-bangladesh858b2994-6cd7-4b30-a89d-24e5dc51dd23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india-vs-bangladesh858b2994-6cd7-4b30-a89d-24e5dc51dd23-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానుంది. ఇలా నజ్ముల్ హసన్ శాంటో నేతృత్వంలో 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ దళం భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు ఉదయం నుంచి బయలుదేరిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు చెన్నైకి చేరుకుంది. india vs bangladesh{#}BCCI;vedhika;Pakistan;VIRAT KOHLI;Chidambaram;Bangladesh;ICC T20;Cricket;september;Indiaభారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు?india vs bangladesh{#}BCCI;vedhika;Pakistan;VIRAT KOHLI;Chidambaram;Bangladesh;ICC T20;Cricket;september;IndiaMon, 16 Sep 2024 13:56:00 GMTటీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానుంది. ఇలా నజ్ముల్ హసన్ శాంటో నేతృత్వంలో 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ దళం భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈరోజు ఉదయం నుంచి బయలుదేరిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు చెన్నైకి చేరుకుంది.


మొదటి టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా ఇప్పటికే సన్నద్ధం కాగా, ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. పటిష్టమైన పాకిస్తాన్ పై విజయోత్సవం తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి పాక్ పై టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. తద్వారా బంగ్లాదేశ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగి పర్యాటక జట్టును టీమిండియా పట్టించుకోకపోతే ఓటమి తప్పదు.


అయితే ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనే సందేహంలో క్రికెట్ అభిమానుల మధ్య గందరగోళం నెలకొంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సిరీస్ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హిందూ మహాసభ నిరసన సేగలు అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్ ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.


ప్రస్తుతానికి చెన్నైలో నిరసన సెగ లేనప్పటికీ రెండో టెస్టు వేదిక కాన్పూర్ లో, అలాగే తొలి టీ20 సిరీస్ జరిగే గ్వాలియర్ లో హిందూ మహాసభ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ టెస్ట్ సిరీస్ తో పాటు మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం లండన్‌ నుంచి విరాట్‌ కోహ్లీ వచ్చేశాడు. ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>