Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raninia7b2cc62-67af-48cf-94b1-4e0098ec1444-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raninia7b2cc62-67af-48cf-94b1-4e0098ec1444-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక బస్ కండక్టర్ స్థాయి నుంచి ఏకంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న సూపర్ స్టార్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు.. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అయితే 70 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఆయన. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాప్ సినిమాలతో రజనీకాంత్ సranini{#}Rajani kanth;Conductor;Darsakudu;temple;Onam;India;Josh;Lokesh;Lokesh Kanagaraj;Director;Cinemaషూటింగ్లో రజిని డాన్స్ స్టెప్పులు.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్?షూటింగ్లో రజిని డాన్స్ స్టెప్పులు.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్?ranini{#}Rajani kanth;Conductor;Darsakudu;temple;Onam;India;Josh;Lokesh;Lokesh Kanagaraj;Director;CinemaMon, 16 Sep 2024 10:00:00 GMT" style="height: 196px;">సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక బస్ కండక్టర్ స్థాయి నుంచి ఏకంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న సూపర్ స్టార్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు.. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అయితే 70 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఆయన.


 గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాప్ సినిమాలతో రజనీకాంత్ సతమతమైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన జైలర్ మూవీతో మాత్రం సాలిడ్ హిట్టు కొట్టారు అని చెప్పాలి. ఇప్పటికి రజిని చేతుల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఇలాంటి సినిమాలలో అటు లోకేష్ కనకరాజుతో తీస్తున్న సినిమా కూడా ఒకటి. తనదైన సినిమాలతో వరుసగా సూపర్ హిట్ల కొడుతూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజు. ఇక రజిని లోకేష్ కనకరాజు కాంబోలో తెరకేక్కుతున్న మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.


 ఈ సినిమాకు కూలి అనే టైటిల్ పెట్టగా.. ఇక ఈ సినిమాలో దేవా అనే పాత్రలో కనిపించబోతున్నాడు రజనీకాంత్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇటీవల మూవీ సెట్ లో ఓనం సందర్భంగా వెట్టియాన్ లోని మనసిలాయో సాంగ్ కు రజిని స్టెప్పులు వేశారు. దర్శకుడు లోకేష్ ను ఆహ్వానించగా ఆయన డాన్స్ చేసేందుకు నిరాకరించారు. ఇక అటు రజనీకాంత్ మాత్రం ఎంతో జోష్ తో తనదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>