Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/------c527d789-dc76-4842-acdc-0ab0a4f952d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/------c527d789-dc76-4842-acdc-0ab0a4f952d7-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలపై వస్తున్న లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ నివేదికలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో మంది సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఎంతోమంది నటీమణులు కూడా ఇలా తమ కెరియర్లో ఎదురైన చేదు అనుభవాలు ఎంతోమంది నటులు తమతో ప్రవర్తించిన తీరును కూడా చెప్పుకొచ్చారు అని విషయం తెలిసిందే. ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులపై లైంగిక జానీమాస్టర్{#}johnny;Johnny;Tollywood;hema;Police Station;Heroineషాకింగ్ : జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు?షాకింగ్ : జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు?జానీమాస్టర్{#}johnny;Johnny;Tollywood;hema;Police Station;HeroineMon, 16 Sep 2024 08:15:00 GMTఈ మధ్య కాలం లో సినీ సెలబ్రిటీలపై వస్తున్న లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈ నివేదికలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎంతో మంది సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఎంతోమంది నటీమణులు కూడా ఇలా తమ కెరియర్లో ఎదురైన చేదు అనుభవాలు ఎంతోమంది నటులు తమతో ప్రవర్తించిన తీరును కూడా చెప్పుకొచ్చారు అని విషయం తెలిసిందే.


 ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు తెర మీదకి వస్తూ ఏకంగా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇలాంటివి ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు తెరమీదకి వచ్చి సంచలనం గా మారి పోయాయి . జానీ మాస్టర్ లైంగికం గా వేధిస్తున్నాడు అంటూ ఒక డాన్సర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.



 తనపై అత్యాచారం చేయడం తో పాటు గాయ పరిచాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆ లేడీ డాన్సర్. దీంతో ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది కాస్త సంచలనం గా మారి పోయింది. అయితే ఈ లైంగిక ఆరోపణలను నిజమేన కాదా అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా జానీ మాస్టర్ ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే షోలో కంటెస్టెంట్ గా వెళ్లి ఆ తర్వాత మాస్టర్గా మారి.. ఇక ఇప్పుడు సౌత్ లోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>