MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగతవారం ‘మత్తువాదలరా 2’ మూవీతో పోటీ పడుతూ విడుదలైన ‘ఉత్సవం’ మూవీని ఎవరు కనీస స్థాయిలో కూడ పట్టించుకోవడంలేదు. ప్రముఖ హీరోయిన్ రజీనా తో పాటు ప్రకాష్ రాజ్ రాజేంద్ర ప్రసాద్ నాజర్ బ్రహ్మానందం అలీ లాంటి ప్రముఖ నటీనటులతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం రసూల్ ఎల్లోర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించడంతో ఈ మూవీ ఏదైనా సంచలనాలు క్రియేట్ చేస్తుందా అని చాలామంది భావించారు. ఈ మూవీ ద్వారా దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరోను అదేవిధంగా అర్జున్ సాయి అనే కొత్త డైరెక్టర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ మూవీ ప్రMAHUU VADALARA 2{#}Brahmanandam;dileep;dilip;Music;prasad;Prakash Raj;Love;Heroine;Arjun;Yevaru;Hero;News;Tollywood;Darsakudu;Director;Audience;Cinemaఆ హీరోని పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు !ఆ హీరోని పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు !MAHUU VADALARA 2{#}Brahmanandam;dileep;dilip;Music;prasad;Prakash Raj;Love;Heroine;Arjun;Yevaru;Hero;News;Tollywood;Darsakudu;Director;Audience;CinemaMon, 16 Sep 2024 09:00:00 GMTగతవారం ‘మత్తువాదలరా 2’ మూవీతో పోటీ పడుతూ విడుదలైన ‘ఉత్సవం’ మూవీని ఎవరు కనీస స్థాయిలో కూడ పట్టించుకోవడంలేదు. ప్రముఖ హీరోయిన్ రజీనా తో పాటు ప్రకాష్ రాజ్ రాజేంద్ర ప్రసాద్ నాజర్ బ్రహ్మానందం అలీ లాంటి ప్రముఖ నటీనటులతో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం రసూల్ ఎల్లోర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించడంతో ఈ మూవీ ఏదైనా సంచలనాలు క్రియేట్ చేస్తుందా అని చాలామంది భావించారు.



మూవీ ద్వారా దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరోను అదేవిధంగా అర్జున్ సాయి అనే కొత్త డైరెక్టర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ మూవీ ప్రమోషన్ పై చాల ఎక్కువగానే ఖర్చుపెట్టారు. అయితే ఈ మూవీకి కనీసపు ఓపెనింగ్స్ కూడ రాలేదు. హీరో కొత్తవాడైనప్పటికీ కలర్ ఫుల్ ప్రోమోలు ప్రముఖ నటీనటుల కాస్టింగ్ వల్ల ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించారు.  



కనుమరుగైపోతున్న నాటక కళను కొత్త తరానికి పరిచయం చేసి దానికి పూర్వ వైభవం తీసుకురావడం అనే పాయింట్ చుట్టూ ఒక లవ్ స్టోరీని చెప్పడానికి దర్శకుడు మంచి కథను ఎంచుకుని హిట్ కొట్టాలని ప్రయత్నించినప్పటికీ ఈ సినిమాలో ఒకసీన్ మరొక సీన్ కి ఎక్కడా పొంతన లేకపోవడంతో ఈ సినిమను చూసిన ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ సినిమాను ఈ మూవీ ద్వారా పరిచయం అయిన దిలీప్ ప్రకాష్ తానే స్వయంగా నిర్మించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మాణ విలువలకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని తీసినప్పటికీ ఈమూవీ కథ విషయంలో దర్శకుడు కానీ హీరో కానీ ఎక్కడా శ్రద్ధ చూపకపోవడంతో ‘మత్తువదలరా 2’ మూవీకి అన్నివిధాల కలిసి వచ్చింది. ఈ సినిమాకు రివ్యూలు వ్రాసిన వారు మాత్రం ‘ఉత్సవం’ సినిమాను చూసి జనం నీరసపడిపోతున్నారనీ ఈ పరిస్థితులు ‘మత్తువదలరా 2’ కు అదృష్టంగా మారింది అనుకోవాలి..    










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>