MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya65b0a68d-0975-4dd8-a1fa-e8006a8ab582-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya65b0a68d-0975-4dd8-a1fa-e8006a8ab582-415x250-IndiaHerald.jpg వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో సినిమాగా అఖండ 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య అభిమానులు ఒక్కటే ఆసక్తితో ఉన్నారు. సోషల్ మీడియాలను దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుంది. balayya{#}boyapati srinu;Balakrishna;Tollywood;Hero;Cinemaబాల‌య్య - విశ్వ‌క్‌సేన్ మ‌ల్టీస్టార‌ర్ డీటైల్స్ ..!బాల‌య్య - విశ్వ‌క్‌సేన్ మ‌ల్టీస్టార‌ర్ డీటైల్స్ ..!balayya{#}boyapati srinu;Balakrishna;Tollywood;Hero;CinemaMon, 16 Sep 2024 14:38:52 GMT-  బాల‌య్య అఖండ 2 లో విశ్వ‌క్ సేన్
- దైవ‌త్వం ... శివ‌త్వం కోణంలో అఖండ 2 స్టోరీ
- బాల‌య్య - బోయ‌పాటి కాంబోలో 4వ సినిమా

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్‌లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి నట‌సింహం బాలయ్య బాబు కాంబినేషన్ అంటేనే ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో సినిమాగా అఖండ 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య అభిమానులు ఒక్కటే ఆసక్తితో ఉన్నారు. సోషల్ మీడియాలను దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుంది.


ఇక దర్శకుడు బోయపాటిసినిమా స్క్రిప్ట్ పనులలో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని.. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీనటులపై చర్చ జరుగుతుందని తెలుస్తుంది. తాజాగా ఓ క్రేజీ రూమర్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా లో టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విశ్వక్సేన్ నటిస్తున్నాడట. దర్శకుడు బోయపాటి శ్రీను.. విశ్వ‌క్‌ కోసం స్పెషల్ రోల్‌ రాశాడని.. సెకండ్ హాఫ్ లో విశ్వక్‌ పాత్ర వస్తుందని తెలుస్తోంది. బాలయ్య, విశ్వక్‌ చాలా సన్నిహితంగా ఉంటారు. మరి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉన్నా ఈ సినిమాపై ఎప్పటి వరకు ఉన్న అంచనాలు దాదాపు రెట్టింపు అయిపోతాయి.


ఇక కథ‌ ప్రకారం ఈ సినిమా పూర్తిగా దైవత్వం పై ... శివ‌త్వం కోణంలో సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం.. దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్లు ఉంటాయని తెలుస్తోంది. అన్నట్టు అఖండ 2లో బాలీవుడ్ స్టార్ హీరో.. సీనియర్ హీరో సంజయ్ దత్ కీలకపాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>