PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcre683bb0c-5e6b-4f8e-ae69-23693cb905e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcre683bb0c-5e6b-4f8e-ae69-23693cb905e3-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత... కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైడ్రా లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని రేవంత్ రెడ్డి.. హాట్ టాపిక్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాల కారణంగా... తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో... రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా క్షీణించిపోయింది. KCR{#}revanth;Hyderabad;Telangana;Revanth Reddy;Rajya Sabha;bus;Partyరేవంత్ కు షాక్... తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ కొత్త కుట్రలు ?రేవంత్ కు షాక్... తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ కొత్త కుట్రలు ?KCR{#}revanth;Hyderabad;Telangana;Revanth Reddy;Rajya Sabha;bus;PartySun, 15 Sep 2024 12:19:00 GMTతెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత... కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైడ్రా లాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని రేవంత్ రెడ్డి.. హాట్ టాపిక్ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాల కారణంగా... తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూ డా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో... రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా క్షీణించిపోయింది.


 అటు రైతులు కూడా ఆగమవుతున్నారు.  40 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 వేల కోట్లు చేసి చేతులు దులుపుకుంది. దీంతో చాలామంది రైతులకు రుణమాఫీ అసలు జరగలేదు. అంతేకాదు.. రైతు బంధు కూడా ఎగబెట్టారు. మొన్నటి వర్షాకాలంలో రైతుబంధు అసలు ఎవరికి వేయలేదు. ఇప్పుడు యాసంగి.. కాలానికి 15 రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే మళ్ళీ రైతుబంధు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.

 
అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల ముందే ఎండ కట్టేందుకు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగానే మరో 10 రోజుల్లోనే... తెలంగాణ భవన్లో అదిరిపోయే మీటింగ్ నిర్వహించబోతున్నారట కేసీఆర్. రేవంత్ రెడ్డి వైఫల్యాలు అయిన రుణమాఫీ, రైతు బంధు, వరద బాధితుల సమస్యలు, అన్నదాతల ఆత్మహత్యలు లాంటి అంశాల పైన.. పార్టీ నేతలతో చర్చించనున్నారట.

 ఇక ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అందరూ, ముఖ్యమైన నేతలు అందరూ  ఈ తెలంగాణ భవన్ లో నిర్వహించే సమావేశానికి రాబోతున్నారట. ఈ సమావేశం నిర్వహించిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెళ్ళనున్నారని సమాచారం. బస్సు యాత్ర నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>