MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-cinema-news-lates-ramyakrishna-baladithya-viral-news-photoc20fdf77-9347-4ec1-9f12-b09a30163782-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-cinema-news-lates-ramyakrishna-baladithya-viral-news-photoc20fdf77-9347-4ec1-9f12-b09a30163782-415x250-IndiaHerald.jpgఇక్కడి ఫొటోలో మొన్నటి అందాల తార రమ్యకృష్ణ వాటేసుకున్న పిల్లాడు ఎవరో చెప్పగలరా? ఆ కుర్రాడు ఛైల్డ్ ఆర్టిస్టుగా పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలా ఏకంగా మనోడు 40కు పైగా సినిమాల్లో బాలనటుడిగా మెప్పించి, ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారిపోయాడు మరి. అవును, ప్రేమకథా చిత్రాలు, కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు ఈ కుర్రాడు. అయితే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించినప్పటికీ ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలనే ఈ హ్యాండ్సమ్ హీరో ఇంచుకొని telugu cinema news lates ramyakrishna baladithya viral news photo{#}bala;rajendra prasad;tara;Bigboss;television;gold;village;Comedy;Husband;Hero;Silver;babu rajendra prasad;Kurradu;Samarasimhareddy;Helloరమ్యకృష్ణ వాటేసుకున్న ఈ పిల్లాడెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు?రమ్యకృష్ణ వాటేసుకున్న ఈ పిల్లాడెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు?telugu cinema news lates ramyakrishna baladithya viral news photo{#}bala;rajendra prasad;tara;Bigboss;television;gold;village;Comedy;Husband;Hero;Silver;babu rajendra prasad;Kurradu;Samarasimhareddy;HelloSun, 15 Sep 2024 12:30:00 GMTఇక్కడి ఫొటోలో మొన్నటి అందాల తార రమ్యకృష్ణ వాటేసుకున్న పిల్లాడు ఎవరో చెప్పగలరా? ఆ కుర్రాడు ఛైల్డ్ ఆర్టిస్టుగా పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలా ఏకంగా మనోడు 40కు పైగా సినిమాల్లో బాలనటుడిగా మెప్పించి, ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారిపోయాడు మరి. అవును, ప్రేమకథా చిత్రాలు, కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు ఈ కుర్రాడు. అయితే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించినప్పటికీ ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలనే ఈ హ్యాండ్సమ్ హీరో  ఇంచుకొని మరీ చేస్తాడు. అందుకే యూత్ లో మనోడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

ఇక సినిమాల్లోనే కాకుండా టీవీ షోల్లోనూ కూడా ఈ యంగ్ హీరో అదరగొట్టేస్తున్నాడు. బిగ్ బాస్ లో కూడా ఈ కుర్రాడు సందడి చేశాడు. అయితే ఇంతకీ ఈ పిల్లాడు ఎవరంటే... ఛైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించి చంటిగాడు సినిమాతో ఆకట్టుకున్న బాలాదిత్య. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాలో బాల నటుడిగా మొదటి సారి వెండి తెరపై కనిపించాడు ఈ హీరో. అదిగో అప్పుడు తీసిన ఫోటోనే అది. ఆ తర్వాత రౌడీ గారి పెళ్లాం, జంబలకిడి పంబ, అత్తింట్లో అద్దె మొగుడు, బంగారు బుల్లోడు, అబ్బాయి గారు. ఏవండి ఆవిడ వచ్చింది, అన్నా, హలో బ్రదర్, తీర్పు, మాతో పెట్టుకోకు, సూపర్ పోలీస్, లిటిల్ సోల్జర్స్, సమరసింహారెడ్డి తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి అదరగొట్టాడు.

ఈ నేపథ్యంలో ఆ తరువాత కాలంలో 2003లో చంటిగాడు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రూమ్ మేట్స్, సుందరానికి తొందరెక్కువ, వేట, జాజిమల్లి , 1940లో ఒక గ్రామం తదితర సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. 1940లో ఒక గ్రామం సినిమాకైతే అప్పట్లో నేషనల్ అవార్డు, నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. కేవలం వెండితెరపైనే కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ కంటెస్టెంట్ గా మెప్పించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇక చివరిగా మా ఊరి పొలిమేర 2 సినిమాలో కనిపించాడు బాలా దిత్య. ప్రస్తుతం అయితే కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా చేస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>