PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gautu-shirisha23a3380b-6cb5-46fe-8155-eb8173b6f7df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gautu-shirisha23a3380b-6cb5-46fe-8155-eb8173b6f7df-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన గౌతు శిరీష 2024 ఎన్నికల్లో మాత్రం సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన గౌతు శిరీష పార్టీలో పత్యేక గుర్తింపుతో సత్తా చాటుతుండటం గమనార్హం. gautu shirisha{#}Hanu Raghavapudi;District;TDP;YCP;MLA;mediaపాలనలో మార్కు చూపిస్తూ ప్రశంసలు అందుకున్న గౌతు శిరీష.. ఆమెకు ఎవరూ సాటిరారుగా!పాలనలో మార్కు చూపిస్తూ ప్రశంసలు అందుకున్న గౌతు శిరీష.. ఆమెకు ఎవరూ సాటిరారుగా!gautu shirisha{#}Hanu Raghavapudi;District;TDP;YCP;MLA;mediaSun, 15 Sep 2024 07:40:00 GMTశ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన గౌతు శిరీష 2024 ఎన్నికల్లో మాత్రం సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన గౌతు శిరీష పార్టీలో పత్యేక గుర్తింపుతో సత్తా చాటుతుండటం గమనార్హం.
 
పలాస ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంతో పాటు ప్రజలకు మేలు జరిగేలా గౌతు శిరీష కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్హతలు ఉన్నా పథకాలు అందని పేదలకు ఆ పథకాలు అందడానికి గౌతు శిరీష తన వంతు కృషి చేస్తున్నారు. మరోవైపు గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన వేధింపులపై ఆమె న్యాయ పోరాటానికి దిగారు.
 
తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అశ్లీల , అసభ్యకర రాతలు రాయడం గురించి శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అన్యాయాలపై కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తాను నిలబెట్టుకుంటానని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే అప్పల్రాజుకు సైతం వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఆమె పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచారు.
 
గౌతు శిరీషకు దైవ భక్తి కూడా ఎక్కువ కాగా భూ ఆక్రమణలు చేసిన వాళ్లపై కూడా చర్యలు తీసుకునే దిశగా ఆమె అడుగులు వేస్తుండటం గమనార్హం. పబ్లిక్ గ్రీవెన్స్ లో సైతం గౌతు శిరీష పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వరద బాధితులకు తన నెల రోజుల వేతనాన్ని ఆమె విరాళంగా ఇచ్చారు. గౌతు శిరీష గొప్ప మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గౌతు శిరీష ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>