MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-senior-heros455ef131-1184-4113-8864-5cfcb1cb5346-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-senior-heros455ef131-1184-4113-8864-5cfcb1cb5346-415x250-IndiaHerald.jpgవచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంతకాలం క్రితం రవితేజ హీరోగా "RT 75" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మొTollywood senior heros{#}Bari;Narasimha Naidu;Mrugaraju;Ravi;Balakrishna;ravi teja;Makar Sakranti;January;anil ravipudi;Chiranjeevi;Venkatesh;Cinema;Newsవచ్చే సంక్రాంతికి బాలయ్య ఎంట్రీ ఇస్తే మళ్లీ అన్ని సంవత్సరాల క్రితం పరిస్థితి రిపీట్.. అప్పుడు విన్నర్ ఎవరో తెలుసా..?వచ్చే సంక్రాంతికి బాలయ్య ఎంట్రీ ఇస్తే మళ్లీ అన్ని సంవత్సరాల క్రితం పరిస్థితి రిపీట్.. అప్పుడు విన్నర్ ఎవరో తెలుసా..?Tollywood senior heros{#}Bari;Narasimha Naidu;Mrugaraju;Ravi;Balakrishna;ravi teja;Makar Sakranti;January;anil ravipudi;Chiranjeevi;Venkatesh;Cinema;NewsSun, 15 Sep 2024 14:12:00 GMTవచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంతకాలం క్రితం రవితేజ హీరోగా "RT 75" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మొదట వార్తలు వచ్చిన ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతి బారి నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

దానితో అసలైన పోరు చిరు , వెంకీ ల మధ్య సంక్రాంతికి ఉంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ రసవత్తరమైన పోరులోకి బాలయ్య కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ , బాబి దర్శకత్వంలో "NBK 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటివరకు మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అని మూవీ బృందం అనుకుంటున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇదే కానీ జరిగితే 2001 వ సంవత్సరం జరిగిన సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవి పుత్రుడు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో మృగరాజు ఫ్లాప్ కాగా , దేవి పుత్రుడు యావరేజ్ విజయాన్ని అందుకుంది. నరసింహా నాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>