MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr845960ef-08a6-44d7-893d-2e03444a037a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr845960ef-08a6-44d7-893d-2e03444a037a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను రెండు Jr ntr{#}Janhvi Kapoor;koratala siva;Music;Saif Ali Khan;Beautiful;Jr NTR;september;Cinema;Andhra Pradesh;News;Teluguభారీ టికెట్ ధరలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర.. సామాన్యుడి పై భారీ భారం..?భారీ టికెట్ ధరలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర.. సామాన్యుడి పై భారీ భారం..?Jr ntr{#}Janhvi Kapoor;koratala siva;Music;Saif Ali Khan;Beautiful;Jr NTR;september;Cinema;Andhra Pradesh;News;TeluguSun, 15 Sep 2024 11:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు గాను రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు నైజాం ఏరియాలో మల్టీ ప్లెక్స్ లలో 413 రూపాయలుగా ఉండబోతున్నట్లు , సింగిల్ స్క్రీన్ లలో 250గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మల్టీ ప్లెక్స్ లలో 365 రూపాయలుగా టికెట్ ధర ఉండనున్నట్లు , సింగల్ స్క్రీన్ లలో 200 రూపాయలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఈ సినిమా భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే దేవర సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు భారీగా ఉండటంతో సామాన్య ప్రజలకు ఈ సినిమా చూడడం కాస్త క్లిష్టమైన విషయమే అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినట్లు అయితే పెరిగిన టికెట్ ధరలతో ఈ మూవీ కి భారీ కలెక్షన్లు మొదటి రోజు వచ్చే అవకాశం ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>