PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/koushik-reddy1145afd5-d112-4b2b-8943-d866c8c3527c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/koushik-reddy1145afd5-d112-4b2b-8943-d866c8c3527c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి... దూసుకు వెళ్తున్నారు. గెలిచిన మొదటిసారి గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ... పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఈటల రాజేందర్ లాంటి.. బడా లీడర్ ను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి... చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన.. ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ... ఎక్కడ తగ్గడం లేదు కౌశిక్ రెడ్డి. koushik reddy{#}Prasthanam;Eatala Rajendar;Revanth Reddy;Huzurabad;KCR;Telangana;Party;kaushik;Yevaru;Mohandas Karamchand Gandhi;Minister;MLA;Assembly;Congress;Bharatiya Janata Party;Leaderతెలంగాణ కొడాలి నానిగా.. పాడి కౌశిక్ రెడ్డి... ముట్టుకుంటే మాడిపోవడమే ?తెలంగాణ కొడాలి నానిగా.. పాడి కౌశిక్ రెడ్డి... ముట్టుకుంటే మాడిపోవడమే ?koushik reddy{#}Prasthanam;Eatala Rajendar;Revanth Reddy;Huzurabad;KCR;Telangana;Party;kaushik;Yevaru;Mohandas Karamchand Gandhi;Minister;MLA;Assembly;Congress;Bharatiya Janata Party;LeaderSun, 15 Sep 2024 00:33:59 GMT
* ఉద్యమ నాయకుడు ఈటలను ఓడించిన మొనగాడు
* బండ బూతులు తిట్టడంలో కొడాలి నానిని మించిపోయాడు
* ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నిక
* కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు


తెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి... దూసుకు వెళ్తున్నారు. గెలిచిన మొదటిసారి గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ... పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఈటల రాజేందర్ లాంటి.. బడా లీడర్ ను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి... చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన.. ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన..  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ...  ఎక్కడ తగ్గడం లేదు కౌశిక్ రెడ్డి.

 సింపుల్ గా చెప్పాలంటే...  తెలంగాణ రాష్ట్ర కొడాలి నానిగా   పాడి కౌశిక్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. వాస్తవంగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి... తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. యూత్ ప్రెసిడెంట్ నుంచి... ఎమ్మెల్యే అభ్యర్థి వరకు కాంగ్రెస్ లోనే హుజురాబాద్ నియోజకవర్గంలో హల్చల్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే టిఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించే అంత పని చేశారు పాడి కౌశిక్ రెడ్డి.

కానీ గులాబీ పార్టీని ఈటల రాజేందర్ వీడిన తర్వాత... కెసిఆర్ చెంతకు చేరారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవిని కూడా దక్కించుకున్నారు కౌశిక్ రెడ్డి. అయితే 2003 అసెంబ్లీ ఎన్నికల్లో... హుజరాబాద్ ఎమ్మెల్యే టికెట్ను కూడా కౌశిక్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్ ను చిత్తుచిత్తుగా ఓడించారు కౌశిక్ రెడ్డి. ఎవరు ఊహించని విధంగా ఈటెల రాజేందర్ ను మట్టికరించారు.

 పోరాటాల గడ్డ  పైన.. ఉద్యమ నేత ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ పార్టీ తరఫున  కౌశిక్ రెడ్డి ఓడించడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. ప్రతిపక్ష గొంతును గట్టిగా వినిపిస్తున్నారు, కౌశిక్ రెడ్డి. ఏపీకి చెందిన అరికపూడి గాంధీ లాంటి నేతలను కూడా... వణికించారు కౌశిక్ రెడ్డి. అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. కచ్చితంగా కౌశిక్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని కొంతమంది చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>