PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pithapuram-jagan-ex-cm-ycp-pawan-kalyan-chandrababuff796189-2fd9-4df8-b47f-5f034a111dd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pithapuram-jagan-ex-cm-ycp-pawan-kalyan-chandrababuff796189-2fd9-4df8-b47f-5f034a111dd4-415x250-IndiaHerald.jpgవైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి.. గత కొద్దిరోజుల నుంచి ప్రజల మధ్యకు మళ్ళీ రావడం ప్రారంభించారు.ఈ ఏడాది ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండాలనే నిర్ణయాన్ని కూడ తీసుకున్నారు. ఇటీవలే వరద బాధితులను కూడా పరామర్శించి..ఏపీ సీఎం చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిన్నటి రోజున పర్యటించినట్లు తెలుస్తోంది. అక్కడ ఏలేరు రిజర్వాయర్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వెళ్లినటPITHAPURAM;JAGAN;EX CM;YCP;PAWAN KALYAN;CHANDRABABU{#}kalyan;CM;Success;Deputy Chief Minister;Reddy;Government;News;Jagan;YCP;CBNపిఠాపురం: పవన్ కళ్యాణ్ అడ్డాలో జగన్ సక్సెస్ అయినట్టేనా..?పిఠాపురం: పవన్ కళ్యాణ్ అడ్డాలో జగన్ సక్సెస్ అయినట్టేనా..?PITHAPURAM;JAGAN;EX CM;YCP;PAWAN KALYAN;CHANDRABABU{#}kalyan;CM;Success;Deputy Chief Minister;Reddy;Government;News;Jagan;YCP;CBNSun, 15 Sep 2024 11:25:00 GMTవైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి.. గత కొద్దిరోజుల నుంచి ప్రజల మధ్యకు మళ్ళీ రావడం ప్రారంభించారు.ఈ ఏడాది ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండాలనే నిర్ణయాన్ని కూడ తీసుకున్నారు. ఇటీవలే వరద బాధితులను కూడా పరామర్శించి..ఏపీ సీఎం చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిన్నటి రోజున పర్యటించినట్లు తెలుస్తోంది. అక్కడ ఏలేరు రిజర్వాయర్ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వెళ్లినట్లు తెలుస్తోంది.


అలాగే అక్కడ వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు కూడా వెళ్లారు. అయితే కొంత దూరం కారులోనే వెళ్ళిన తర్వాత నేరుగా వరద నీటిలో దిగి బాధితులను పరామర్శించడం జరిగింది. అక్కడే మీడియాతో మాట్లాడుతూ తన స్టైల్లో కూటమి ప్రభుత్వం పైన సెటైర్లు వేస్తూ, విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఏం చేశారనే తెలియజేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన టూర్ అయితే సక్సెస్ అయ్యింది కానీ మైలేజ్ వచ్చిందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు సందేహంగా మారిందట.


నేతలకు వినిపించిన సమాచారం మేరకు జగన్ టూర్ లో ప్రజల ఆదరణ మరింత ఎక్కువగా వచ్చిందని. ప్రజలు ఎక్కువగా సహాయం చేయాలని అడిగిన వారే ఎక్కువగా ఉన్నారని.. కానీ జగన్ ఎలాంటి సహాయం చేయలేదని ఎలాంటి ప్రకటన కూడా తెలియజేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించిన మాజీ సీఎం  జగన్.. పిఠాపురానికి మాత్రం ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పలేదు. దీంతో అక్కడి ప్రజలు కాస్త అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఒకవైపు సక్సెస్ అయిన మైలేజ్ కాస్త పెరిగినట్టుగా అనిపించిన సహాయం చేయలేదనేది మాత్రం మైనస్ గా మారిపోయిందనే విధంగా కొంతమంది నేతలు తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు మరిన్ని నిర్ణయాలు తీసుకొని జగన్ ముందుకు వెళ్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>