PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan7242943c-4fcd-4023-a0a6-b93063ea57c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan7242943c-4fcd-4023-a0a6-b93063ea57c1-415x250-IndiaHerald.jpgవైసీపీ అధికారానికి దూరమైన తర్వాత పరిస్థితి మారిందా? ఇప్పుడే అసలు సిసలు కష్టాలు మొదలయ్యాయా? అధికారాన్ని అనుభవించిన వారు సైడ్ అవుతున్నారా? ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారు ముఖం చాటేయడానికి కారణాలేంటి ? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగమే వికటించిందా? దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వం లోటు కనిపిస్తోందా? ఆ ప్రచారంలో నిజం ఎంత ? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ రెండో సారి విజయం కోసం చాలా రకాలుగా ప్రయోగాలు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల కొత్త అభ్యర్థులjagan{#}Nijam;Andhra Pradesh;Jagan;YCP;Minister;Partyవైనాట్ కాదు.. నియోజకవర్గాన్ని నడిపే వారే లేరు? వైసీపీ లో విచిత్ర పరిస్థితి..!వైనాట్ కాదు.. నియోజకవర్గాన్ని నడిపే వారే లేరు? వైసీపీ లో విచిత్ర పరిస్థితి..!jagan{#}Nijam;Andhra Pradesh;Jagan;YCP;Minister;PartySat, 14 Sep 2024 14:09:00 GMTవైసీపీ అధికారానికి దూరమైన తర్వాత పరిస్థితి మారిందా? ఇప్పుడే అసలు సిసలు కష్టాలు మొదలయ్యాయా? అధికారాన్ని అనుభవించిన వారు సైడ్ అవుతున్నారా? ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారు ముఖం చాటేయడానికి కారణాలేంటి ? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగమే వికటించిందా? దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వం లోటు కనిపిస్తోందా? ఆ ప్రచారంలో నిజం ఎంత ?


ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ రెండో సారి విజయం కోసం చాలా రకాలుగా ప్రయోగాలు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించారు. కొందరిని పక్కన పెట్టడం, వేరే జిల్లాల నేతలను తీసుకు వచ్చి పోటీ చేయించడం వంటి ప్రయోగాలు చేయించారు. ఒకటి కాదు రెండు కాదు వంద చోట్ల వరకు ఇదే పని జరిగింది. కానీ అన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు.


దీంతో పక్కను తప్పించిన వారు అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. కొత్తవారు సైతం తమకెందుకులే అంటూ ముఖం చాటేస్తున్నారు. ఐదేళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం సైడ్ అయిపోతున్నారు. దీంతో వైసీపీ అంటే జగన్ మాత్రమే అన్నట్లు నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంది. ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.


వైనాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగారు జగన్. వ్యతిరేకత ఉన్న చోట కొత్తవారిని ప్రయోగించారు. అయితే ఒక నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న వారికి మరో నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో పాత నేతలతో పాటు కొత్త వారు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఇలా దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన నాయకత్వం లేదు. ప్రస్తుతం వీరంతా వైసీపీ క్యాడర్ ని పట్టించుకునే స్థితిలో లేరు. దీంతో మెజార్టీ క్యాడర్ కూటమి వైపు చూస్తున్నారు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలే.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>