PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-brsf49f977a-0ac3-41b9-b174-3963f264df91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-brsf49f977a-0ac3-41b9-b174-3963f264df91-415x250-IndiaHerald.jpgమళ్లీ మేము గనక అధికారంలోకి వస్తే అంటూ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వార్నింగ్ ఇస్తున్నాయి. టిడిపి కార్యాలయం పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ తో ఇటీవల ములాఖ‌త్‌ అయిన జగన్ బయటకు వచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ... టిడిపి లా కేసులు నమోదు చేస్తాం అప్పుడు జైళ్లు కూడా సరిపోవంటూ వార్నింగ్ ఇస్తున్నారు. jagan brs{#}YCPజ‌గ‌న్ - బీఆర్ఎస్ రివేంజ్ పాలిటిక్స్ డైలాగులు ..!జ‌గ‌న్ - బీఆర్ఎస్ రివేంజ్ పాలిటిక్స్ డైలాగులు ..!jagan brs{#}YCPSat, 14 Sep 2024 11:15:24 GMTఆంధ్రప్రదేశ్లో ఘోరంగా ఓడిపోయి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైసిపి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ను ఫాలో అవుతుందో లేక బీఆర్ఎస్ వైసిపి ని ఫాలో అవుతుందో కానీ ... ఇటీవల రెండు పార్టీల నుంచి ఒకే రకమైన డైలాగులు వెళుతున్నాయి. మళ్లీ మేము గనక అధికారంలోకి వస్తే అంటూ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వార్నింగ్ ఇస్తున్నాయి. టిడిపి కార్యాలయం పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ తో ఇటీవల ములాఖ‌త్‌ అయిన జగన్ బయటకు వచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ... టిడిపి లా కేసులు నమోదు చేస్తాం అప్పుడు జైళ్లు కూడా సరిపోవంటూ వార్నింగ్ ఇస్తున్నారు.


తాజాగా బి ఆర్ ఎస్ నేతలు కూడా ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో శేరిలింగం ప‌ల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ - హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అప్పుడు కాంగ్రెస్ కు అరికెపూడి గాంధీకి కామెంట్ చూపిస్తామని జగన్ తరహాలో వార్నింగ్‌ ఇచ్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ - ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే ఏడాది కూడా కాలేదు. అప్పుడే ప్రత్యర్థి పార్టీలు మేమే అధికారంలోకి వస్తాం కక్ష సాధింపులకు దిగుతాం అంటూ హెచ్చరికలు జారీ చేయడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విమర్శలకు వ్యక్తం అవుతున్నాయి.


అయినా పవర్ లోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్న బీఆర్ఎస్ వైసిపి నేతల వ్యాఖ్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటే ఈ రెండు పార్టీల పరిస్థితి వెంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్న అవుతున్నాయి. ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పాటు ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయి ... ఈ నాలుగేళ్లపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తలుచుకుంటే బీఆర్ఎస్ - వైసిపి పార్టీలకు చుక్కలు చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>