Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-4a5351e9-e085-4622-82aa-b6cd743c0478-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-4a5351e9-e085-4622-82aa-b6cd743c0478-415x250-IndiaHerald.jpgసాధారణంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇరు జట్లు ఆ మ్యాచ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చూస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఆ మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాయి. అయితే ఒకవేళ ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మ్యాచ్లో అయినా బాగా రానించాలని సిరీస్ లో పైచేయి సాధించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉంటే అందులో తప్పక విజయం సాధించాలని పట్టుదల ఇరు జట్లకు ఉంటుంది. అయితే ఇటీవల ఇలాంటి పట్టుదలతోనే ఉన్న న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. గ్రేటర్ నోయిడా వేదికగా ఇరుజట్ల మcricket {#}New Zealand;Zimbabwe;Friday;Noida;Varsham;India;Pakistan91 ఏళ్లలో.. ఇండియాలో ఇలా జరగడం మొదటి సారి?91 ఏళ్లలో.. ఇండియాలో ఇలా జరగడం మొదటి సారి?cricket {#}New Zealand;Zimbabwe;Friday;Noida;Varsham;India;PakistanSat, 14 Sep 2024 09:00:00 GMTసాధారణంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇరు జట్లు ఆ మ్యాచ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చూస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఆ మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాయి. అయితే ఒకవేళ ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మ్యాచ్లో అయినా బాగా రానించాలని సిరీస్ లో పైచేయి సాధించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉంటే అందులో తప్పక విజయం సాధించాలని పట్టుదల ఇరు జట్లకు ఉంటుంది.


 అయితే ఇటీవల ఇలాంటి పట్టుదలతోనే ఉన్న న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. గ్రేటర్ నోయిడా వేదికగా ఇరుజట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు చివరికి వర్షార్పణం అయిపోయింది. చివరి రోజు కూడా వర్షం పడటంతో ఎంపైర్లు శుక్రవారం మ్యాచ్ నూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ జరిగేలా చేయడానికి గ్రౌండ్ సిబ్బంది ఎంతలా శ్రమించిన మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో తొలిరోజు ఆట సాధ్యపడలేదు.


 డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సిద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశం గా మారింది. రెండో రోజు నుంచి వర్షం కురవడం తో ఆట రద్దు అవుతూ వచ్చింది. చివరి రోజు శుక్రవారం కూడా వరుణుడు కరుణించక పోవడంతో చివరికి చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. దీంతో గ్రేటర్ నోయిడా చెత్త రికార్డును మూట పెట్టుకుంది. 1933 నుంచి భారత్ సుదీర్ఘ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుంది. 91 ఏళ్లలో కనీసం ఒక్క బంతి కూడా పడకుండా ఓ టెస్ట్ మ్యాచ్ రద్దు అవడం భారత్ లో ఇదే తొలిసారి. ఆసియాలో ఇది రెండో సారి. 1998లో పాక్ వేదికగా పాక్ - జింబాబ్వే మధ్య జరిగిన మూడో టెస్ట్ బంతి పడకుండానే తుడిచి పెట్టుకు పోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>