MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines6f392abd-d4b4-44eb-ba07-6c79927e1b23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines6f392abd-d4b4-44eb-ba07-6c79927e1b23-415x250-IndiaHerald.jpgఅలా ఈ హీరోయిన్లందరికి కూడా ఓ సెంటిమెంట్ ఉందట.అదేంటంటే.. ఆ డైరెక్టర్ తో తన్నులు తింటే కచ్చితంగా స్టార్స్ అయిపోతారనే టాక్ ఉంది.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీనియర్ దర్శకుడు భారతి రాజా.. ఈయన దర్శకత్వంలో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా పరిచయమైన హీరోయిన్లందరిలో మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ ఈయన చేతిలో దెబ్బలు తిన్నవారేనట. heroines{#}priyamani;Heroineహీరోయిన్ల క్రేజీ సెంటిమెంట్.. ఆ డైరెక్టర్‌తో తన్నులు తింటే స్టార్స్ అయిపోతారా..!హీరోయిన్ల క్రేజీ సెంటిమెంట్.. ఆ డైరెక్టర్‌తో తన్నులు తింటే స్టార్స్ అయిపోతారా..!heroines{#}priyamani;HeroineSat, 14 Sep 2024 11:10:19 GMTఇండస్ట్రీలో ఉండే చాలామందికి కొన్ని రకాల సెంటిమెంట్స్ ఉంటాయి. అలా ఈ హీరోయిన్లందరికి కూడా ఓ సెంటిమెంట్ ఉందట.అదేంటంటే.. ఆ డైరెక్టర్ తో తన్నులు తింటే కచ్చితంగా స్టార్స్ అయిపోతారనే టాక్ ఉంది.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీనియర్ దర్శకుడు భారతి రాజా.. ఈయన దర్శకత్వంలో ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలా పరిచయమైన హీరోయిన్లందరిలో మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ ఈయన చేతిలో దెబ్బలు తిన్నవారేనట.


అలా భారతీరాజా దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమైన  రాధిక, రేవతి, రేఖ, ప్రియమణి, రాధా వంటి హీరోయిన్లు ఈయన చేతిలో చెంప దెబ్బలు తిన్నవారేనట. ఇక ఈ విషయాన్ని ఈ హీరోయిన్లే కొన్ని ఇంటర్వ్యూలలో స్వయంగా బయటపెట్టారు. అంతేకాదు ఆ డైరెక్టర్ కొట్టడం వల్లే మేము ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్ కి వచ్చాము అని కూడా చెప్పుకుంటారు.అయితే వీరందరిలో ప్రియమణి అయితే డైరెక్టర్ ని కొట్టకూడదు అనే కండిషన్ పెట్టిందట.కానీ ఓ సందర్భంలో ప్రియమణి కూడా భారతి రాజా గారితో చెంప దెబ్బ తిన్నదట.


కానీ అది కూడా నా మంచికే అంటూ ప్రియమణి ఓ సందర్భంలో చెప్పింది. అయితే డైరెక్టర్ భారతి రాజా ఈ హీరోయిన్లందరినీ కొట్టడానికి ప్రధాన కారణం ఏడ్చే సన్నివేశాలలో ఈ హీరోయిన్స్ సరిగ్గా నటించకపోయేవారట. అలా హీరోయిన్ రేఖకు గుర్తింపునిచ్చిన మూవీ కడలోర కవితైగల్ షూటింగ్ సమయంలో చివరి వరకు బాగానే చేసిందట. కానీ చివరి సమయంలో భారతి రాజాతో రేఖ దెబ్బలు తిని కాస్త బాధపడిందట. ఇక రాధా,రాధిక,రేవతి వంటి హీరోయిన్స్ కూడా వారు నటించిన సినిమాల్లో ఎన్నిసార్లు గ్లిజరిన్ వాడిన గ్లిజరిన్ డబ్బాలు అయిపోతున్నాయట.


కానీ వాళ్ళ కళ్లలో నుంచి నీరు రాకపోవడంతో ఆ సన్నివేశం బాగా రావడం కోసం వాళ్లను కూడా చెంప దెబ్బలు కొట్టారట. ఇక ఆయన కొట్టడంతో వాళ్లు ఏడ్చే సన్నివేశాలు అద్భుతంగా చేసేవారట. అలా హీరోయిన్లందరికీ భారతీరాజా కొట్టడం వల్లే స్టార్స్ అయ్యాము అనే ఒక సెంటిమెంట్ ఉందట. ఇక ఇప్పటి జనరేషన్లో ఉన్న హీరోయిన్లు అయితే చిన్న మాట అన్నా కూడా సినిమానే రిజెక్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>