EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/liquer8357dd2e-f9e4-44b1-85c3-37d6a5f2abf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/liquer8357dd2e-f9e4-44b1-85c3-37d6a5f2abf5-415x250-IndiaHerald.jpgదిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల నుంచి గోవా మీదుగా దిల్లీ వరకు మూలాలున్న కుంభకోణం ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి దిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు ఎందరినో జైలు పాలు చేసిన సంచలనాత్మక కేసు. అలాంటి కేసు ఇప్పుడు కీలక మలుపులు తీసుకుంటుంది. ఒకరి వెంట మరొకరు ప్రధాన నిందితులు నుంచి కేసులో సాధారణ నేపథ్యం ఉన్నవారు అందరూ బెయిల్ పై బయటకు వస్తున్నారు. తాజాగా సీఎం కేజ్రీవాల్ బెయిల్ లభించడంతో ఇక ఈ కేసులో ప్రముఖులెవరూ జైల్లో లేనట్లు చెప్పొచ్చు. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా మద్యం కేliquer{#}Sameer;Goa;CBI;Supreme Court;Kalvakuntla Kavitha;Telangana Chief Minister;CM;Hyderabad;Telangana;Minister;Telugu;Wife;Joseph Vijayలిక్కర్ స్కాం ముగిసినట్లేనా? అందరికీ బెయిల్ వచ్చిందిగా.. !లిక్కర్ స్కాం ముగిసినట్లేనా? అందరికీ బెయిల్ వచ్చిందిగా.. !liquer{#}Sameer;Goa;CBI;Supreme Court;Kalvakuntla Kavitha;Telangana Chief Minister;CM;Hyderabad;Telangana;Minister;Telugu;Wife;Joseph VijaySat, 14 Sep 2024 13:29:00 GMTదిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల నుంచి గోవా మీదుగా దిల్లీ వరకు మూలాలున్న కుంభకోణం ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి దిల్లీ సీఎం కేజ్రీవాల్ వరకు ఎందరినో జైలు పాలు చేసిన సంచలనాత్మక కేసు. అలాంటి కేసు ఇప్పుడు కీలక మలుపులు తీసుకుంటుంది. ఒకరి వెంట మరొకరు ప్రధాన నిందితులు నుంచి కేసులో సాధారణ నేపథ్యం ఉన్నవారు అందరూ బెయిల్ పై బయటకు వస్తున్నారు.


తాజాగా సీఎం కేజ్రీవాల్ బెయిల్ లభించడంతో ఇక ఈ  కేసులో ప్రముఖులెవరూ జైల్లో లేనట్లు చెప్పొచ్చు. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా మద్యం కేసులో 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఈయన భార్య అనారోగ్యానికి గురయ్యారు. సిసోదియాకు ఇటీవల బెయిల్ ఇచ్చింది.


ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చారు. దీంతో దిల్లీ పెద్దలిద్దరికీ బెయిల్ దొరికిందనే చెప్పాలి. ఇక దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ను 2022 మేలో దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొట్టమొదటి సారిగా ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు. ఈయనకు బెయిల్ దొరికింది.  


తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిల్లీ లిక్కర్ స్కాం కేసులో 5 నెలలకు పైగా జైలులో ఉన్నారు. ఈమె అస్వస్థతకు కూడా గురయ్యారు. ఎట్టకేలకు కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఆమె హైదరాబాద్ రావడం అంతా జరిగిపోయాయి. మనీ ల్యాండరింగ్ లో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆప్ వాలంటీర్ చన్ ప్రీత్ సింగ్, విజయ్ నాయర్, హైదరాబాద్ వ్యాపారి అరుణ్ పిళ్లై వీళ్లందరికీ బెయిల్ వచ్చింది.


ఇదే క్రమంలో మద్యం కేసులో వరుసగా బెయిల్స్ రావడానికి నెలలు, ఏళ్ల పాటు జైలులో ఉన్నవారు బయటకు రావడానికి ఈడీ, సీబీఐ విచారణ వైఫల్యం అనే వారు కూడా ఉన్నారు. నిందితులపై మోపిన అభియోగాలను కోర్టుల్లో రుజువు చేయడంతో ఈ సంస్థలు విఫలం మయ్యాయి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>