Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle96a3da9a-f417-4120-808e-9c1728d08747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle96a3da9a-f417-4120-808e-9c1728d08747-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవా జోరుగా కొనసాగుతోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సూపర్ హిట్ చిత్రాలను.. మరో సారి థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. జోరుగా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ కు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది. 2006 లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలు, కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంతగsocialstars lifestyle{#}genelia;surekha vani;king;100 days;Sri Venkateshwara Creations;Bommarillu;Oy;Coffee;cinema theater;sree;Success;Varsham;Blockbuster hit;Hero;mahesh babu;Box office;media;Cinemaబొమ్మరిల్లు : కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ వచ్చేస్తుంది..రీరిలీజ్ ఎప్పుడంటే..?బొమ్మరిల్లు : కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ వచ్చేస్తుంది..రీరిలీజ్ ఎప్పుడంటే..?socialstars lifestyle{#}genelia;surekha vani;king;100 days;Sri Venkateshwara Creations;Bommarillu;Oy;Coffee;cinema theater;sree;Success;Varsham;Blockbuster hit;Hero;mahesh babu;Box office;media;CinemaSat, 14 Sep 2024 15:24:41 GMTసినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవా జోరుగా కొనసాగుతోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సూపర్ హిట్ చిత్రాలను.. మరో సారి థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. జోరుగా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్ కు సిద్దమైనట్లు టాక్ వినిపిస్తోంది.
2006 లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాలోని పాటలు, కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద 100 రోజులు ఆడిన సినిమాగా సెన్షేషన్ క్రియేట్ చేసింది. సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ.. కలెక్షన్ల వర్షం కురిపించింది. యువతను ఎంతగానో అట్రాక్ట్ చేసిన ఈ సినిమా.. అంతేనా.. అంటూ జెనిలియా కుర్రకారు మనసు దొచేస్తే.. ఇంకేం కావాలంటూ అమాయకంగా అడిగి లవర్‌ బాయ్‌ అయిపోయాడు సిద్దు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. లవ్‌, ఎమోషన్స్‌, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంది ఈ సినిమా. ప్రేమకథగా యూత్‌రి, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టేలే చేసింది. 2006 ఆగస్ట్‌ 9న థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది.

మూవీ వచ్చి ఇప్పటికీ 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గా అదే క్రేజ్‌ను కొనసాగిస్తుంది.ఇదిలావుండగా ఈ నెల 21న మళ్లీ థియేటర్ లలో విడుదల కానుంది. ఈమేరకు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా లో ప్రకటించింది. "ఏ ఫిల్మ్ థట్ నెవెర్ ఫేడ్స్". ఆ ఆనందాన్ని పంచడానికి వచ్చేస్తున్నాం. "కుదిరితే కప్ కాఫీ సెప్టెంబర్ 21న మళ్లీ థియేటర్లలో" అని పోస్ట్ చేసింది.ఈ సినిమా సాధించిన విజయం, యూత్‌లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఏకంగా డైరెక్టర్‌ ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. హీరో సిద్ధార్థ్‌, జెన్నిలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, సురేఖ వాణి, సునీల్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.ఇదిలావుండగా ఇటీవలే రీ రిలీజైన సిద్దార్థ్ ‘ఓయ్’ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలు, సీన్స్ తెగ వైరలయ్యాయి. అప్పట్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఓయ్ సినిమాకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే.. ఇక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బొమ్మరిల్లు హవా ఏ విధంగా ఉండబోతుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమా ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>