MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-insulted-by-samanthaa6dd3be4-9189-441e-b95a-9208a130cded-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-insulted-by-samanthaa6dd3be4-9189-441e-b95a-9208a130cded-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తన నటన, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులని చేస్తుంది ఈ చిన్నది. ఏ మాయ చేసావే సినిమాలో చాలా అమాయకంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అప్పట్లో యూత్ ను ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబట్టింది. samantha{#}maya;Samantha;Remake;Joseph Vijay;Seethamma Vakitlo Sirimalle Chettu;Dookudu;Katthi;Interview;Heroine;NTR;Tamil;trivikram srinivas;mahesh babu;Tollywood;Cinemaసమంత పరువు తీసిన టాలీవుడ్ హీరో...?సమంత పరువు తీసిన టాలీవుడ్ హీరో...?samantha{#}maya;Samantha;Remake;Joseph Vijay;Seethamma Vakitlo Sirimalle Chettu;Dookudu;Katthi;Interview;Heroine;NTR;Tamil;trivikram srinivas;mahesh babu;Tollywood;CinemaThu, 12 Sep 2024 11:44:00 GMT టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తన నటన, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులని చేస్తుంది ఈ చిన్నది. ఏ మాయ చేసావే సినిమాలో చాలా అమాయకంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అప్పట్లో యూత్ ను ఆకట్టుకుని మంచి వసూళ్లను రాబట్టింది.


ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత వరుస పెట్టి సినిమాల్లో నటించి అభిమానులతో పాటు దర్శక నిర్మాతలను సైతం ఆకట్టుకుంది. దీంతో సమంతతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపించారు. మొదటి సినిమా నుంచి సమంత వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్గా నిలిచింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన జతకట్టింది. నాగచైతన్య, మహేష్ బాబు, విజయ్, సూర్య, అల్లు అర్జున్, శర్వానంద్, నితిన్, ఎన్టీఆర్ వంటి ఎందరో స్టార్ హీరోల సరసన నటించింది.


అయితే సమంత ఎంతోమంది హీరోలతో నటించింది కానీ మహేష్ బాబుతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. మహేష్ బాబు, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలకే హైలెట్ అయ్యేవి. ఇండస్ట్రీలోనే బెస్ట్ జోడిగా సమంత, మహేష్ బాబు గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు వంటి సినిమాలలో నటించారు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా షూటింగ్ జరిగే సమయంలో మహేష్ బాబును సరదాగా ఇంటర్వ్యూ చేసిందట హీరోయిన్ సమంత. ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, త్రివిక్రమ్ పాల్గొన్నారు.


ఆ ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడుతూ... మహేష్ బాబును ఇటీవల మీరు ఏ సినిమా చూశారు అని అడగ్గా... తమిళ్ లో విజయ్ చేసిన కత్తి సినిమా చూశానని చెప్పాడు. వెంటనే సమంత ఆ సినిమాని రీమేక్ చేయొచ్చు కదా అని అడిగింది. దాంతో మహేష్ బాబు నేను సినిమాలు రీమేక్ చేయను. అసలు ఏ సినిమా కూడా నేను రీమిక్స్ చేయను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. మరి మీ సినిమాలు విజయ్ రీమేక్ చేస్తున్నాడు కదా అని సమంత అడగ్గా.... రీమేక్ చేసే వారిని నేను ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడను అని మహేష్ బాబు తెలిపాడు. దీంతో సమంత సైలెంట్ అయింది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>