Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-land-titilimg-act4dc26ea3-6b37-499c-ac5d-7271aad4b732-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-land-titilimg-act4dc26ea3-6b37-499c-ac5d-7271aad4b732-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ దుందుభి మ్రోగించింది.. ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది..గతంలో అధికారంలో వున్న వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ఈ సారి 11 సీట్లు మాత్రమే సాధించడానికి వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వున్న తీవ్ర వ్యతిరేకతే కారణంగా చెబుతారు.. అంతే కాకుండా ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ ఇంతటి ఘోర పతనానికి కారణం అయింది..గత ప్రభ #land titilimg act{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Survey;history;Cabinet;Telangana Chief Minister;Government;TDP;Jagan;YCP;Andhra Pradesh;CBN;CMచీకటి చట్టానికి చరమ గీతం పాడిన చంద్రబాబు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడుగా..!!చీకటి చట్టానికి చరమ గీతం పాడిన చంద్రబాబు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడుగా..!!#land titilimg act{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Survey;history;Cabinet;Telangana Chief Minister;Government;TDP;Jagan;YCP;Andhra Pradesh;CBN;CMThu, 12 Sep 2024 09:02:48 GMT

* ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

* వైసీపీ పతనానికి అసలు కారణం అదే..

* అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే భూభక్షక చట్టం రద్దు చేసిన కూటమి ప్రభుత్వం..


ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ దుందుభి మ్రోగించింది.. ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది..గతంలో అధికారంలో వున్న వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ఈ సారి 11 సీట్లు మాత్రమే సాధించడానికి వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వున్న తీవ్ర వ్యతిరేకతే కారణంగా చెబుతారు.. అంతే కాకుండా ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ ఇంతటి ఘోర పతనానికి కారణం అయింది..గత ప్రభుత్వ వెర్షన్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ వివాదాలు కారణంగా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి చరమ గీతం పాడుతూ భూవివాదాలు లేకుండా భూమిపై యజమానికి శాశ్వత హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశం అని వైసీపీ ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పుకొచ్చారు.అప్పటి ప్రతిపక్షంలో వున్న టీడీపీ పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే భూమిపై సర్వ హక్కులు ప్రభుత్వానికి వస్తాయని ప్రచారం చేసింది.. కూటమి అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెడతానానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తెలిపారు.. అనుకున్నట్లు గానే కూటమి అధికారంలోకి రావడంతో ఈ చట్టం రద్దుపై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం చేసారు..మొదటి కాబినెట్ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టారు.


ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆలోచన లేకుండా గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది అని విమర్శించారు. న్యాయవాదులు గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగి పోయాయి.. గత ఐదేళ్లలో  భారీగా భూ వివాదాలుపై ఫిర్యాదులు వచ్చాయి.. ఏదైనా భూమిని 22 ఏ అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది.. ప్రభుత్వం ఒప్పకుంటే మళ్లీ ప్రైవేటు భూమిగా మార్చేస్తారు.. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడానికి ఎంతో సమయం పట్టదు..భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోంది.. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాం రాజముద్ర వేస్తాం.. సీఎం బొమ్మ వేసి అప్పట్లో పాస్ పుస్తకాలు ఇచ్చారు.. భూ సర్వే ద్వారా వివాదాలు పెరిగాయి అందుకే హోల్డ్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.అసెంబ్లీలో ఈ బిల్లు రద్దుకు సభ్యులంతా అంగీకారం తెలిపారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>