EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi240cc343-b2d8-4bab-9282-973d391c78b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modi240cc343-b2d8-4bab-9282-973d391c78b8-415x250-IndiaHerald.jpgభారత్ దళాలు.. మా దేశంలో ఉండొద్దు.. అంటూ బెదిరింపులు.. మోదీ ఓ జోకర్ అంటూ వెక్కిరింపులు కానీ అసలు భారత్ దెబ్బకొడితే ఎలా ఉంటుందో తెలిసింది. దిమ్మతిరిగి దారికి వచ్చారు. ఇదంతా కేవలం 9 నెలల్లోనే జరిగింది. ఇదంతా మాల్దీవులు గురించి.. ముందుగా పర్యాటకాన్ని టార్గెట్ చేసి.. ఆర్థికంగా దెబ్బతీసిన భారత్.. ఆపై ఆ దేశ అధ్యక్షుడి మెడలు కూడా వంచింది. ఇప్పుడు ఎవరైతే మోదీని తిట్టారో వారి కొలువులను పీకేసింది. మాల్దీవులకు నిరుడు నవంబరులో మహ్మద్ మొయిజ్జు అధ్యక్షుడు అయ్యారు. ఈ తర్వాత ఏడు రోజుల్లోనే భారత్ తో విభేదాలకు modi{#}రాజీనామా;Kanna Lakshminarayana;Indians;Joker;Narendra Modi;Minister;Indiaమోదీనా మజాకా! దెబ్బకి దారికొచ్చిన మాల్దీవులు?మోదీనా మజాకా! దెబ్బకి దారికొచ్చిన మాల్దీవులు?modi{#}రాజీనామా;Kanna Lakshminarayana;Indians;Joker;Narendra Modi;Minister;IndiaThu, 12 Sep 2024 12:07:00 GMTభారత్ దళాలు.. మా దేశంలో ఉండొద్దు.. అంటూ బెదిరింపులు.. మోదీజోకర్ అంటూ వెక్కిరింపులు కానీ అసలు భారత్ దెబ్బకొడితే ఎలా ఉంటుందో తెలిసింది. దిమ్మతిరిగి దారికి వచ్చారు. ఇదంతా కేవలం 9 నెలల్లోనే జరిగింది. ఇదంతా మాల్దీవులు గురించి.. ముందుగా పర్యాటకాన్ని టార్గెట్ చేసి.. ఆర్థికంగా దెబ్బతీసిన భారత్.. ఆపై ఆ దేశ అధ్యక్షుడి మెడలు కూడా వంచింది. ఇప్పుడు ఎవరైతే మోదీని తిట్టారో వారి కొలువులను పీకేసింది.



మాల్దీవులకు నిరుడు నవంబరులో మహ్మద్ మొయిజ్జు అధ్యక్షుడు అయ్యారు. ఈ తర్వాత ఏడు రోజుల్లోనే భారత్ తో విభేదాలకు దిగారు. మాల్దీవుల్లో ఉంటున్న భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని ఆదేశించారు. వారు చెప్పినట్లే చేసింది భారత్. అయితే వ్యూహాత్మకంగా మోదీ మాల్దీవులకు సమీపంలో ఉండే భారత్ కు చెందిన లక్ష్య దీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని లక్ష్య దీప్ వెళ్లాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.


అలా విషయం చేరవేశారు అంటే.. అసలు సంగంతి ఏమంటే.. భారతీయులు మాల్దీవులు కన్నా లక్ష్య దీప్ లను ఎంచుకోవాలని చెప్పడం. దీనికి భారత్ లోని వివిధ రంగాల ప్రముఖులు నంఉచి అద్భుత స్పందన వచ్చింది. చాలా మంది పర్యాటకులు మాల్దీవ్ టూర్ వెళ్లి వచ్చారు. చాలా మంది తమ మాల్దీవ్ టూర్లు క్యాన్సిల్ చేయించుకున్నారు. దీనిపై కడుపు మండిన మాల్దీవుల మంత్రులు మోదీని దూషించారు. తాజాగా వీరిలో ఇద్దరు రాజీనామా చేశారు.


చైనా మాయలో పడిన మోయిజ్జుకు అసలు విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు మన దేశంతో సంబంధాలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఆయన త్వరలో దిల్లీ రానున్నారు. ఈ ప్రకటన బయటకు రాకముందే మాల్దీవుల మంత్రుల రాజీనామా చోటు చేసుకోవడం గమనార్హం. మోదీ లక్ష్య దీప్ పర్యటనపై మల్షా షరీఫ్, మారియప్ సహునా మరో మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడారు. భారత విదేశాంగ శాఖ దీనిని గట్టిగా ఖండించింది. ఈ నేపథ్యంలో మంత్రులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మోదీ లక్ష్యదీప్ పిలుపుతో మాల్దీవుల పర్యాటక రంగం కుదేలైంది. దానికి బుద్ధి వచ్చింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>