PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viral-news-latest-marriage-conditions-women-lifestylef0acddd1-1abc-4ec0-8757-7923853e1606-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viral-news-latest-marriage-conditions-women-lifestylef0acddd1-1abc-4ec0-8757-7923853e1606-415x250-IndiaHerald.jpgఎంతో పటిష్టమైన భారతీయ సంస్కృతులలో వివాహ వ్యవస్థ ప్రధానమైనది. కానీ నేడు అలాంటి వివాహ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఓ వైపు కట్నం సరిపోలేదంటూ డిమాండ్ చేసే వరులు పీక్కుతింటుంటే, మరోవైపు తల్లిదండ్రులు… తమ పిల్లని ఇవ్వాలంటే వరుడుకి లక్షల జీతం, కోట్ల ఆస్తులు ఉండాలని గొంతెమ్మ కోర్కెలు కోరే వారు ఎక్కువైనారు. తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవాలి. ఓ మహిళ తనకు వరుడు కావాలని.. కండిషన్స్ అప్లై! అంటూ ఓ పోస్ట్ చేసింది.viral news latest marriage conditions women lifestyle{#}engineer;Degree;Parents;job;Ee Rojullo;marriageవైరల్: రెండో పెళ్లి కోసం ఓ మహిళ కండిషన్స్... నో అత్తమామ, 30 లక్షల జీతం!వైరల్: రెండో పెళ్లి కోసం ఓ మహిళ కండిషన్స్... నో అత్తమామ, 30 లక్షల జీతం!viral news latest marriage conditions women lifestyle{#}engineer;Degree;Parents;job;Ee Rojullo;marriageThu, 12 Sep 2024 11:00:00 GMTఎంతో పటిష్టమైన భారతీయ సంస్కృతులలో వివాహ వ్యవస్థ ప్రధానమైనది. కానీ నేడు అలాంటి వివాహ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఓ వైపు కట్నం సరిపోలేదంటూ డిమాండ్ చేసే వరులు పీక్కుతింటుంటే, మరోవైపు తల్లిదండ్రులు… తమ పిల్లని ఇవ్వాలంటే వరుడుకి లక్షల జీతం, కోట్ల ఆస్తులు ఉండాలని గొంతెమ్మ కోర్కెలు కోరే వారు ఎక్కువైనారు. తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవాలి. ఓ మహిళ తనకు వరుడు కావాలని.. కండిషన్స్ అప్లై! అంటూ ఓ పోస్ట్ చేసింది. అయితే ఇది తనకి మొదటి వివాహం అయినా సరిపెట్టుకోవచ్చేమో... సదరు మహిళకి ఇది రెండో వివాహం. దాంతోనే నెటిజన్లు బిత్తరబోతున్నారు.

విషయంలోకి వెళితే... వరుడు కావాలని అంటూ ఓ పోస్ట్ చేసిన మహిళ BEd డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి గాను రూ. 1.3 లక్షలు సంపాదిస్తోంది. మొదటి భర్తతో వివాదాలు ఏర్పడి, విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అందుకోసం వరుడు కావాలంటూ ఆన్ లైన్ లో ఓ ప్రకటన ఇస్తూ... అందులో తన గొంతెమ్మ కోర్కెల లిస్ట్ ఒకటి ఇచ్చింది. ఆ లిస్ట్ చూసిన బ్రహ్మ చారులు మాకు పెళ్లే వద్దని మొత్తుకుంటున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే, తనకు కాబోయే వరుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలట. అది కాకుంటే, MBA, MS చేసి కనీసం సంవత్సరానికి రూ. 30 లక్షల వార్షిక వేతనం కలిగి ఉండాలట. ఇక ఆ యువకుడు భారతదేశం, యుఎస్ లేదా యూరప్‌లో పని చేసి ఉండాలట. రూ. 30 లక్షలు సంగతి పక్కనబెడితే అతనికి తల్లిదండ్రులు ఉండకూడదట.. ఒకవేళ అతనికి తల్లిదండ్రులు ఉంటే, పెళ్లి తర్వాత అతనితో తల్లిదండ్రులు జీవించకూడదు అనే షరతులు పెట్టింది. అక్కడితో ఆగలేదండి బాబు... ఉండడానికి సొంతంగా 3 bhk ఇల్లు, ఇంటి పనులు చేయడానికి ఎప్పుడూ ఒక పని మనిషి అందుబాటులో ఉండాలి అని పేర్కొంది. దాంతో నెటిజన్లు ఈ రోజుల్లో పెళ్లి అనేది వ్యాపార ఒప్పందంలా మారిపోయిందని వాపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>