Viralmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/devaracb6ff5f0-044b-4737-bf3d-95f44de841b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/devaracb6ff5f0-044b-4737-bf3d-95f44de841b3-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. అభిమానుల క్షేమం కోసం అనుక్షణం పాటుపడే ఎన్టీఆర్ అంటే అందరికీ ప్రాణం. ఇప్పుడు అలాంటి ప్రాణంగా అభిమానించే ఓ అభిమానికి వచ్చిన కష్టం చూస్తే అందరికీ గుండె తరుక్కుపోతుంది. 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్‌ పేషెంట్‌ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్‌ కి వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు 'దేవర' సినిమా చూడాలని కdevara{#}Tirupati;Cancer;contract;Heart;Parents;Athadu;NTR;media;Cinema'దేవర' చూసే వరకు బ్రతికించండి.. చివరి కోరిక తీర్చండి అంటూ అభిమాని ఆవేదన..!!'దేవర' చూసే వరకు బ్రతికించండి.. చివరి కోరిక తీర్చండి అంటూ అభిమాని ఆవేదన..!!devara{#}Tirupati;Cancer;contract;Heart;Parents;Athadu;NTR;media;CinemaThu, 12 Sep 2024 14:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. అభిమానుల క్షేమం కోసం అనుక్షణం పాటుపడే ఎన్టీఆర్ అంటే అందరికీ ప్రాణం.
ఇప్పుడు అలాంటి ప్రాణంగా అభిమానించే ఓ అభిమానికి వచ్చిన కష్టం చూస్తే అందరికీ గుండె తరుక్కుపోతుంది. 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్‌ పేషెంట్‌ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్‌ కి వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు 'దేవర' సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియా సమావేశం నిర్వహించారు.'నా కుమారుడి కౌశిక్‌ కి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చివరి కోరికగా 'దేవర' సినిమా చూడాలని అడుగుతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న నా కొడుకును కనీసం దేవర సినిమా విడుదల అయ్యేవరకు బతికించాలని ఆ తల్లి కన్నీటి పర్యంతం అయింది. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక' అంటూ కౌశిక్‌ తల్లి డాక్టర్లను వేడుకుంటోంది.

కన్నబిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఇన్నాళ్లు కష్టపడి, ఇప్పుడు తన చివరి కోరిక తీర్చడం కోసం ఆ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఆ యువకుడి తల్లి మీడియా ముందు కన్నీటిపర్యంతం అయ్యింది.కౌశిక్‌ ఎక్కువ కాలం బతకడు అని డాక్టర్లు చెప్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉన్న ఆ యువకుడు.. 'అమ్మా.... నేను బతకనని తెలుసు. నా కోసం బాధపడకండి. దేవర సినిమా విడుదల వరకూ బతికించండి చాలు.. నా చివరి కోరిక తీర్చండి' అని కౌశిక్‌ కోరుతున్నాడని ఆ తల్లిదండ్రులు వేదనతో చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
టీటీడీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌కు 2022 నుంచీ బ్లడ్‌ కేన్సర్‌ కు చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని కిడ్‌వై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బోన్‌ మారో చికిత్సకు రూ.60లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం, దాతలు తమకు సాయం చేయాలని కౌశిక్‌ తల్లిదండ్రుల విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఎన్టీఆర్‌ అభిమానులు షేర్ చేసి.. ఆయన్ని ట్యాగ్‌ చేస్తున్నారు. ఈ విషయం ఎన్టీఆర్‌ వరకు చేరితే.. తప్పకుండా సాయం చేస్తారని ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ త్వరగా స్పందించాలని అందరం కోరుకుందాం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>