MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedయావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇపుడు ఒకటే ఉత్కంఠ. అవును, దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అప్డేట్స్ గురించి నెటిజన్లు అనునిత్యం ఆన్లైన్లో వెతుకుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ పాన్ వరల్డ్ మూవీ వచ్చే సంవత్సరం జనవరిలో స్టార్ట్ అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమా త్వరలో షూటింగ్ జరుపుకుంటుంది.telugu movies lates news rajamouli maheshbabu {#}Allu Aravind;sandeep;trivikram srinivas;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Geetha Arts;mahesh babu;Rajamouli;Blockbuster hit;koratala siva;Cinema;Guntur;Success;Indianరాజమౌళి సినిమా తరువాత మహేష్ చేయబోతున్న సినిమాలు!రాజమౌళి సినిమా తరువాత మహేష్ చేయబోతున్న సినిమాలు!telugu movies lates news rajamouli maheshbabu {#}Allu Aravind;sandeep;trivikram srinivas;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Geetha Arts;mahesh babu;Rajamouli;Blockbuster hit;koratala siva;Cinema;Guntur;Success;IndianThu, 12 Sep 2024 11:30:00 GMTయావత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇపుడు ఒకటే ఉత్కంఠ. అవును, దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అప్డేట్స్ గురించి నెటిజన్లు అనునిత్యం ఆన్లైన్లో వెతుకుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ పాన్ వరల్డ్ మూవీ వచ్చే సంవత్సరం జనవరిలో స్టార్ట్ అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమా త్వరలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో సినిమా కోసం రాజమౌళి కనీసం 2 నుంచి 3 ఏళ్ళ సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ తరువాతే ఇతర దర్శకులతో మూవీస్ చేసే అవకాశం ఉంటుంది.

ఇపుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైన్ అప్ గురించి అభిమానులు తెలుసుకోవాలని కుతూహలం చెందుతున్నారు. ఈ తరుణంలో కొన్ని పేర్లు ఇక్కడ ముఖ్యంగా వినబడుతున్నాయి. వారిలో ముగ్గురు స్టార్ దర్శకులు ఉన్నారు. రాజమౌళి మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాని ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట ముందుగా బాగా వినిపిస్తోంది. టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. తరువాత హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా సినిమా ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. గుంటూరు కారంతో త్రివిక్రమ్ మహేష్ బాబుకి సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఆయన సక్సెస్ లపై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దీంతో కొరటాలతో SSMB32 మూవీ చేయడానికి మహేష్ బాబు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే దేవర సిరీస్ సక్సెస్ బట్టి కొరటాలతో ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై మహేష్ బాబు నిర్ణయం ఉంటుందని కూడా గుసగుసలు వినబడుతున్నాయి. ఒక వేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>