MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju5cdd8653-565d-4e36-80c8-027ecaea0ddb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju5cdd8653-565d-4e36-80c8-027ecaea0ddb-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎవడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ... ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో అల్లు అర్జున్ నటించగా ... ఆయనకు లవర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించడం వెనుక ఉన్న అసలDil raju{#}Shruti Haasan;Allu Arjun;dil raju;kajal aggarwal;vamsi;vamsi paidipally;Amy Jackson;Lover;sree;Chiranjeevi;Sri Venkateshwara Creations;Allu Aravind;Pawan Kalyan;Music;Ram Charan Teja;Cinemaఎవడు మూవీలో అల్లు అర్జున్ నటించడం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?ఎవడు మూవీలో అల్లు అర్జున్ నటించడం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?Dil raju{#}Shruti Haasan;Allu Arjun;dil raju;kajal aggarwal;vamsi;vamsi paidipally;Amy Jackson;Lover;sree;Chiranjeevi;Sri Venkateshwara Creations;Allu Aravind;Pawan Kalyan;Music;Ram Charan Teja;CinemaThu, 12 Sep 2024 13:55:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎవడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ... ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో అల్లు అర్జున్ నటించగా ... ఆయనకు లవర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించడం వెనుక ఉన్న అసలు కథను చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ.. ఎవడు సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉంది. దానిని ఎవరో ఒక మంచి ఈమేజ్ ఉన్న నటుడు చేయాలి. ఇక సినిమా దర్శకుడు వంశీ ఖచ్చితంగా ఆ పాత్రను అల్లు అర్జున్ చేయాలి అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు. వేరే ఆప్షన్ లేదు.. అతనే కావాలి అని అన్నాడు. ఇక తర్వాత నేను అరవింద్ గారిని కలిశాను. స్టోరీ మొత్తం చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత బన్నీ కూడా విన్నాడు. ఆయనకు కూడా ఆ స్టోరీ నచ్చింది. అందులోని అతని పాత్ర కూడా బాగా నచ్చింది. దానితో వెంటనే చేస్తాను అన్నాడు.

ఇక ఆ తర్వాత చిరంజీవి కూడా అల్లు అర్జున్ పోర్షన్ కి సంబంధించిన స్టోరీని విన్నాడు. దానికి అల్లు అర్జున్ చాలా బెటర్ అని ఆయన కూడా ఆలోచనకు వచ్చాడు. అలాగే వారంతా కూడా రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇద్దరు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అలా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ పాత్రలో కనబడితే జనాలకు కూడా బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి పాత్రను అల్లు అర్జున్ చేయడం సరైన నిర్ణయం అని అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>